Tirupathi Rao
Gaami OTT Release Date: విశ్వక్ సేన్- చాందినీ చౌదరి లీడ్ రోల్స్ ప్లే చేసిన గామి సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కి సంబంధించి ఇప్పుడు ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
Gaami OTT Release Date: విశ్వక్ సేన్- చాందినీ చౌదరి లీడ్ రోల్స్ ప్లే చేసిన గామి సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కి సంబంధించి ఇప్పుడు ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
Tirupathi Rao
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ ప్లే చేస్తూ తెరకెక్కించిన చిత్రం గామి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఒక సినిమా కోసం ఎనిమిదేళ్ల కష్టం పడ్డారని తెలిసి ఆడియన్స్ షాకయ్యారు. కానీ, సినిమా చూసిన తర్వాత వారి కష్టాన్ని స్క్రీన్ మీద చూసి ఆశ్చర్యపోయారు. సినిమా టీమ్ కూడా ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత వారు పడ్డ కష్టాన్ని మర్చిపోయారు. గామి చూసిన తర్వాత ఇండస్ట్రీలో మళ్లీ ఇలాంటి సినిమా రావాలంటే కొన్నేళ్లు పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గామి ఫ్యాన్స్ కి మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కాబోతోందని తెలుస్తోంది.
గామి సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే థియేటర్లలో చూసిన వాళ్లు కూడా ఈ విజువల్ వండర్ సినిమాని మళ్లీ చూడాల్సిందే అంటూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే గామి సినిమాకి సంబంధించి ఓటీటీ రిలీజ్ పై పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఏప్రిల్ నెలలో గామి సినిమా విడుదల కాబోతోంది అంటూ గట్టిగానే వార్తలు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సంస్థ ఈ గామి చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది.
నిన్నటి వరకు గామి సినిమా వచ్చే వారం స్ట్రీమింగ్ అవుతుందని చెప్పుకొచ్చారు. గత నెల 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక నెల తర్వాత ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. బజ్ కూడా అలాగే వచ్చింది. కానీ, ఇప్పుడు ఇంకో బ్యాడ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గామి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలో విడుదల ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఇంకో వారం ఆలస్యం అవుతుందని వార్తలు వస్తున్నాయి. అలా ఎందుకు చెబుతున్నారో తెలీదు గానీ.. స్ట్రీమింగ్ మాత్రం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. ఏప్రిల్ నెల మూడోవారంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
జీ5 సంస్థ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పడం కష్టం. హునుమ్యాన్ మూవీ విషయంలో కూడా జీ5 స్ట్రీమ్ అయ్యే వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ, సడెన్ గా ఓటీటీలో విడుదల చేసేసింది. ముందుగా జియో సినిమాలో హిందీ వర్షన్ విడుదల అయ్యింది. ఆ తర్వాత రోజే హనుమ్యాన్ తెలుగు వర్షన్ ని జీ5లో స్ట్రీమ్ చేశారు. అయితే ఆ సమయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం, నిర్ధారణ చేయలేదు. ఇప్పుడు గామి విషయంలో కూడా అలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారేమో అనుకుంటున్నారు. మరి.. గామి సినిమా ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.