iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 3 షురూ.. మొదటి గెస్ట్ గా మాలీవుడ్ హీరో

  • Published Oct 01, 2024 | 11:32 AM Updated Updated Oct 01, 2024 | 11:32 AM

Unstoppable season 3: నందమూరి బాలకృష్ణ సినిమాలంటేనే జై బాలయ్య అంటూ ఊగిపోతుంటారు ప్రేక్షకులు. అలాంటిది ఓ టాక్ షో చేస్తున్నారంటే ఇక నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 3 ని స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. దానికి మొదటి గెస్ట్ గా ఎవరు వస్తున్నారో దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

Unstoppable season 3: నందమూరి బాలకృష్ణ సినిమాలంటేనే జై బాలయ్య అంటూ ఊగిపోతుంటారు ప్రేక్షకులు. అలాంటిది ఓ టాక్ షో చేస్తున్నారంటే ఇక నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 3 ని స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. దానికి మొదటి గెస్ట్ గా ఎవరు వస్తున్నారో దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

  • Published Oct 01, 2024 | 11:32 AMUpdated Oct 01, 2024 | 11:32 AM
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 3 షురూ.. మొదటి గెస్ట్ గా మాలీవుడ్ హీరో

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే అభిమానులు జై బాలయ్య అంటూ ఊగిపోతూ ఉంటారు. ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు బాలకృష్ణ. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోస్ కు టఫ్ కాంపిటీషన్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో.. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలాగే మరో వైపు తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఇక అటు ప్రజా సేవా కార్యక్రమాలలోను నిమగ్నం అయ్యి ఉన్నారు. ఇలా తీరికా లేకుండా ప్రస్తుతం బాలకృష్ణ బిజీ బిజీగా ఉన్నారు. వీటితో పాటు ఇప్పుడు బాలకృష్ణ హోస్ట్ గా వహిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 3 కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.

ఓటీటీ లో వచ్చే సినిమాలు , సిరీస్ ల తో పాటు.. ఇప్పుడు టాక్ షో లు , సింగింగ్ షో లకు కూడా విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. ఈ టాక్ షో ల లిస్ట్ లో ముందుండేది మాత్రం.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో నే. 2021 లో ఆహా లో స్టార్ అయిన ఈ షో కు స్పెషల్ క్రేజ్ లభించింది. అప్పటివరకు ఏ షోస్ కు రాని ఎంతో మంది స్టార్స్ అంతా..ఈ షో లో అలరించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. ఇక ఇప్పటికి రెండు సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ షో… ఇప్పుడు మూడవ సీజన్ కు రెడీ అయిపోతుంది. ఇక ఈసారి సీజన్ 3కి మొదటి గెస్ట్  టాలీవుడ్ నుంచి కాకుండా.. మాలీవుడ్ నుంచి రాబోతున్నారట. ఆ గెస్ట్ మరెవరో కాదు .. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమాను తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరోతో పాటు.. ఆ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి.. నిర్మాత నాగవంశీ లు కూడా మొదటి ఎపిసోడ్ లో కనిపించనున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపొయింది.

అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, బోయపాటి, థమన్, శ్రీకాంత్, రాజమౌళి, కీరవాణి, బన్నీ, సుకుమార్, రవితేజ, విజయ్ దేవరకొండ, రానా, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో.. సక్సెస్ ఫుల్ గా 10 ఎపిసోడ్స్ గా కొనసాగింది. ఇక సెకండ్ సీజన్ లో మూవీ స్టార్స్ తో పాటు.. పొలిటీషియన్స్ ను కూడా టాక్ షో లో పార్టిసిపేట్ చేసేలా చేశారు బాలకృష్ణ. ఇలా రెండవ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా 10 ఎపిసోడ్స్ తో పూర్తయింది. మరి ఇప్పుడు మూడో సీజన్ మొదటి గెస్ట్ గా అయితే దుల్కర్ వచ్చేస్తున్నాడు. దుల్కర్ తో పాటు ఇంకా ఎంత మంది స్టార్స్ ఈ సీజన్ లో వస్తారో.. ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో వేచి చూడాలి. మరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 3 అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom