ఓ రేంజ్ హారర్ సిరీస్.. OTTలో ఒంటరిగా చూశారంటే ఇంక అంతే సంగతులు!

Horror Suspense Thriller in OTT: హర్రర్ సినిమాలంటే కేవలం భయపెడితేనే సరిపోదు .. భయంతో పాటు ఆ కథలకు సస్పెన్స్ ను కూడా యాడ్ చేస్తే ఇక ఆ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెప్పి తీరాలి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అలాంటిదే.

Horror Suspense Thriller in OTT: హర్రర్ సినిమాలంటే కేవలం భయపెడితేనే సరిపోదు .. భయంతో పాటు ఆ కథలకు సస్పెన్స్ ను కూడా యాడ్ చేస్తే ఇక ఆ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెప్పి తీరాలి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అలాంటిదే.

నెక్స్ట్ ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. ఇక సినిమాల విషయంలో అయితే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలానే వస్తూనే ఉన్నాయి. కేవలం సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకు, లేదా కేవలం హర్రర్ సినిమాలను చూసి బోర్ కొట్టిన వాళ్లకు ఈ రెండు కలిపి ఒకటే సినిమాలో చూస్తే ఎలా ఉంటుంది. ఇక సినిమా అయిపోయేంతవరకు సీట్ లో నుంచి కదలాలని అనిపించదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సిరీస్ గురించే. సినిమాలకంటే కూడా సిరీస్ లలో సస్పెన్స్ టైమ్ ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనితో ఇలాంటి హర్రర్ సస్పెన్స్ జోనర్ కంటెంట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి వెబ్ సిరీస్ లు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

అసలు ముందు ఈ హర్రర్ సస్పెన్స్ వెబ్ సిరీస్ కథేంటో చూసేద్దాం. ఈ సిరీస్ కథ అంతా కూడా ఊటీలో కొనసాగుతూ ఉంటుంది. ఊటీలోని ఓ ఫారెస్టు ఏరియాకు ఆనుకుని ఉన్న స్కూల్లో వేదాంత్ అనే పిల్లవాడిని జాయిన్ చేస్తారు తన పేరెంట్స్. అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా అమెరికాలో ఉంటూ ఉంటారు. ఇక్కడ స్కూల్ లో మాత్రం వేదాంత్ ని కొత్త ఫ్రెండ్స్ అంతా ఏడిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ రోజు వేదాంత్ ను తన ఫ్రెండ్స్ ఓ రూమ్ లో లాక్ చేస్తారు. కానీ అనుకోని విధంగా ఆ రూమ్ లాక్ ను ఓ దెయ్యం వచ్చి ఓపెన్ చేస్తుంది. దీనితో అందరూ ఆలోచనలో పడతారు.

పైగా ఆరోజు నుంచి వేదాంత్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. దీనితో అతనిని కనిపెట్టుకుని ఉండాలని ఆ స్కూల్ డీన్ కు హెచ్చరికలు వస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఆ స్కూల్ లో ఓ ఫంక్షన్ జరుగుతుంది. దానికి చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ వస్తారు. అక్కడ వాతావరణం అంతా సందడిగా ఉంటుంది కానీ.. అధిరాజ్ అనే వ్యక్తి మాత్రం నిరాశగా కూర్చుని.. ఆ ఫంక్షన్ కి రాని తన ఫ్రెండ్ నినాద్ కోసం భాదపడుతూ ఉంటాడు. కానీ అదే సమయంలో అధిరాజ్ దగ్గరికి వేదాంత్ వెళ్లి, అతనిని నినాద్ లా పలకరిస్తాడు. ఒక చిన్న పిల్లవాడు.. తన స్నేహితుడులా పలకరించడం అధిరాజ్ కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

వేదాంత్ గురించి ఆరా తీయగా.. వేదాంత్ గురించి మిగతా పిల్లలంతా రకరకాలుగా చెబుతుంటారని ఆ స్కూల్ డీన్ చెప్తుంది. కట్ చేస్తే.. ఆ స్కూల్ ఫంక్షన్ కు వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా ఒకరి తర్వాత ఒకరు అనుమాస్పద స్థితిలో చనిపోతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు. అసలు నినాద్ ఎవరు ! అక్కడ అతనికి ఎలాంటి నిజం తెలుస్తుంది? ఓల్డ్ స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఎందుకు చనిపోతుంటారు? వేదాంత్ చిత్రమైన ప్రవర్తనకు కారణం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే “అధూర” అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments