iDreamPost
android-app
ios-app

మీర్జాపూర్ సీజన్ 3పై క్రేజీ అప్ డేట్ ఇచ్చిన దివ్యేందు!

  • Published Apr 07, 2024 | 6:32 PM Updated Updated Apr 07, 2024 | 6:32 PM

Divyendu On Mirzapur Season 3: మీర్జాపూర్ సీజన్ 3పై ఆడియన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్ ఎప్పుడ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మీర్జాపూర్ ఫ్యాన్స్ కి మున్నా భయ్యా క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు.

Divyendu On Mirzapur Season 3: మీర్జాపూర్ సీజన్ 3పై ఆడియన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్ ఎప్పుడ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మీర్జాపూర్ ఫ్యాన్స్ కి మున్నా భయ్యా క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు.

  • Published Apr 07, 2024 | 6:32 PMUpdated Apr 07, 2024 | 6:32 PM
మీర్జాపూర్ సీజన్ 3పై క్రేజీ అప్ డేట్ ఇచ్చిన దివ్యేందు!

ఓటీటీ హవా పెరిగిన తర్వాత అందరూ వెబ్ సిరీస్ల మీద ప్రేమ పెంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్లు తెలుగు ప్రేక్షకుల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. మొదలు పెడితే అస్సలు ఆపకుండా సిరీస్ ని ఎండ్ చేసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. అభిమానుల అభిరుచికి తగ్గట్లు వెబ్ సిరీస్లు కూడా వస్తున్నాయి. దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిన వెబ్ సిరీస్లలో మీర్జాపూర్ కూడా తప్పకుండా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 2 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ కూడా రాబోతోంది. ఈ సిరీస్ కి సంబంధించి తాజాగా మున్నా భయ్యా పాత్ర చేసిన దివ్యేందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన అప్ డేట్ వైరల్ గా మారింది.

పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ఏదైనా ఉందా అంటే తప్పకుండా మీర్జాపూర్ సీజన్ 3 అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి రెండు సీజన్లు తెలుగు ఆడియన్స్ పై కూడా విపరీతమైన ప్రభావం చూపింది. ఇటీవల జరిగిన అమెజాన్ ఈవెంట్లో మీర్జాపూర్ సీజన్ 3 గురించి అప్ డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ మూడో సీజన్ కోసం చాలానే ఎదురుచూపులు చూస్తున్నారు. మీర్జాపూర్ ఫ్యాన్స్ కోసం మున్నా భయ్యా పాత్ర చేసిన దివ్యేందు ఒక అప్ డేట్ ఇచ్చాడు. సీజన్ 3లో తన పాత్ర గురించి కీలక అప్ డేట్ ఇచ్చాడు.

Mirzapur season

మున్నా భయ్యా పాత్ర ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. ఒక డాన్ కొడుకుగా దివ్యేందు యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలాగే ఆ పాత్రకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ, ఈ పాత్రను సీజన్ 2 చివర్లో చనిపోయినట్లు చూపించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల దివ్యేందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అప్పుడు అతనికి మీర్జాపూర్ సీజన్ 3కి సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి. సీజన్ 3లో మున్నా పాత్ర ఉంటుందా అని ప్రశ్నించారు. అయితే దివ్యేందు తన పాత్ర సీజన్ 2తోనే ముగుస్తుందని చెప్పుకొచ్చాడు. సీజన్ 3లో తన పాత్ర లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. మున్నా భయ్యాని మూడో సీజన్లో చూడలేరు అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే దివ్యేందు మాటలు నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే మున్నా భయ్యా పాత్ర లేకపోతే అసలైన విలన్ సిరీస్ లో ఉండడు అనే చెప్పాలి. ఎందుకంటే పంకజ్ త్రిపాఠి మెయిన్ విలన్ అయినా కూడా అగ్రెస్ గా ఉండడు. మున్నా క్యారెక్టర్ లేకపోతే గుడ్డు పోరాటనికి పంకజ్ త్రిపాఠి సరైన పోటీ ఇవ్వలేకపోవచ్చు. అందుకే మున్నా భయ్యా పాత్ర లేదు అని చెప్పినా కూడా అది నమ్మశక్యంగా లేదు. కావాలనే మున్నా పాత్రను సర్ ప్రైజ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికే ఇలా లీకులు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ కి సంబంధించి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటున్నారు. మరి.. మీర్జాపూర్ సీజన్ 3లో మున్నా పాత్ర ఉంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş