iDreamPost
android-app
ios-app

Jr. NTR: దేవరను ఢీ కొడుతున్న కిచ్చా సుదీప్! తారక్ ప్రభంజనాన్ని తట్టుకుంటాడా?

  • Published Aug 22, 2024 | 5:19 PM Updated Updated Aug 22, 2024 | 5:19 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీని ఢీ కొట్టడానికి కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాక్స్ మూవీతో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తారక్ ప్రభంజనం ముందు అతడు తట్టుకోగలడా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీని ఢీ కొట్టడానికి కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాక్స్ మూవీతో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తారక్ ప్రభంజనం ముందు అతడు తట్టుకోగలడా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  • Published Aug 22, 2024 | 5:19 PMUpdated Aug 22, 2024 | 5:19 PM
Jr. NTR: దేవరను ఢీ కొడుతున్న కిచ్చా సుదీప్! తారక్ ప్రభంజనాన్ని తట్టుకుంటాడా?

టాలీవుడ్ ప్రేక్షకులతో పాటుగా యావత్ దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ‘దేవర’ టాప్ లో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే సెప్టెంబర్ 27న దేవర సోలో రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు దేవరను ఢీ కొట్టడానికి కిచ్చా సుదీప్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

కిచ్చా సుదీప్.. దర్శకదీరుడు తెరకెక్కించిన ‘ఈగ’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైయ్యాడు. తన విలనిజంతో తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘విక్రాంత్ రోనా’తో భారీ వసూళ్లను సాధించడమే కాకుండా.. తన క్రేజ్ ను ఇంకాస్త పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు ‘మాక్స్’ మూవీతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమైయ్యాడు. అయితే ఈసారి ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే ఢీ కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. దేవర రిలీజ్ అయ్యే సెప్టెంబర్ 27నే సుదీప్ మాక్స్ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సైతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా.. డెబ్యూ డైరెక్టర్ విజయ్ కార్తికేయన్ మాక్స్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటుగా ఇటు మాస్ అటు ఫ్యామిలీ ఆడియెన్స్ అభిమానులుగా ఉన్న తారక్ మూవీ ముందు కిచ్చా సుదీప్ తట్టుకోగలడా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఇప్పటికే దేవర నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు, భైరా పరిచయం సినిమాపై ఎక్కడాలేని హైప్ ను క్రియేట్ చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ దేవర కోసం ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. మరి ఇలాంటి టైమ్ లో పోయిపోయి తారక్ తో యుద్ధం అంటే బాక్సాఫీస్ వద్ద సుదీప్ తట్టుకుంటాడా? అన్నదే ఇప్పుడు సందేహంగా ఉంది. మరి తారక్ ను ఢీ కొట్టడానికి రెడీ అవుతున్న సుదీప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş