iDreamPost
android-app
ios-app

అఫీషియల్: OTTలోకి సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Siddharth Roy OTT Release Date: దీపక్ సరోజ్ కు తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా సిద్ధార్థ్ రాయ్ తో ఆడియన్స్ ని అలరించాడు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Siddharth Roy OTT Release Date: దీపక్ సరోజ్ కు తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా సిద్ధార్థ్ రాయ్ తో ఆడియన్స్ ని అలరించాడు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

అఫీషియల్: OTTలోకి సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ లో ఇప్పటివరకు చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ, చాలా తక్కువ క్యారెక్టర్లు మాత్రమే ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. వారి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఈ సమాజాన్ని ప్రశ్నిస్తాయి. అలాంటి కోవకు చెందిన ఒక సినిమానే ఈ సిద్ధార్థ్ రాయ్. ఇందులో హీరో క్యారెక్టర్ ను అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ పాత్రతో పోల్చారు. నిజానికి రెండూ రెండు భిన్నమైన క్యారెక్టర్లు అయినప్పటికీ.. ఈ రెండు పాత్రలు ఆడియన్స్ ని మాత్రం అదే రేంజ్ లో ప్రభావితం చేశాయి. ఈ సిద్ధార్థ్ రాయ్ మూవీ కూడా తెలుగు ప్రేక్షకుల వద్ద ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఎట్టకేలకు ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

సిద్ధార్థ్ రాయ్ సినిమా ట్రైలరే టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఆ తర్వాత థియేటర్లలో కూడా పాజిటివ్ టాక్ ఆడియన్స్ ని మెప్పించింది. ఆ మూవీ ఓటీటీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మే 3నుంచి సిద్ధార్థ్ రాయ్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ప్రకటించారు. గెట్ రెడీ టూ విట్ నెస్ టిపికల్ హ్యూమన్ బీయింగ్ అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీపక్ సరోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేశాడు. హీరోగా సిద్ధార్థ్ రాయ్ లాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ ఎంచుకున్నాడు అంటే సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి కూడా చేశాడు. సిద్ధార్థ్ రాయ్ గా దీపక్ సరోజ్ వన్ మ్యాన్ షో చేశాడు. అలాగే ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ యశస్వీకి చాలా మంచి మార్కులు పడ్డాయి. ఇలాంటి ఒక స్టోరీని ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా, డీవియేట్ కాకుండా, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు.

కథ ఏంటంటే:

సిద్ధార్థ్ రాయ్(దీపక్ సరోజ్) చాలా తెలివైన కుర్రాడు. పన్నెండేళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీని అవపోసన పట్టేశాడు. ప్రేమ, బాధ, కోపం, స్వార్థం ఇలాంటి ఎమోషన్స్ అన్నీ ఫేక్ అంటాడు. కేవలం లాజిక్స్ ని మాత్రమే నమ్ముతాడు. ఇంట్లో మనిషి చనిపోయి అంతా ఏడుస్తుంటే.. చనిపోతారని ముందే తెలుసు కదా ఆ మాత్రం మెంటల్ గా ప్రిపేర్ కాలేరా అని ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాంటి ఒక టిపికల్ గాయ్ ఇందు(తన్వి నేగి) ప్రేమలో పడతాడు. అప్పుడే లైఫ్ కి ఎమోషన్స్ కూడా అవసరం అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ రాయ్ లైఫ్ ఎలా ఛేంజ్ అయ్యింది? అతని లాజిక్స్ కరెక్టా? లైఫ్ లో ఎమోషన్స్ కరెక్టా? అసలు ఆ రెండూ సిద్ధార్థ్ రాయ్ లైఫ్ ని ఎలా మార్చాయి అనేదే కథ. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన ఒక మూవీ కూడా ఇది. మరి.. మే 3న ఆహాలో తప్పకుండా చూసేయండి.