OTT లోకి వచ్చేసిన బెస్ట్ ఫ్యామిలీ డ్రామా.. ఎంచక్కా కుటుంబంతో కలిసి చూసేయండి.

Dear Nanna OTT: రెగ్యులర్ యాక్షన్ , సస్పెన్స్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి.. ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే.. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

Dear Nanna OTT: రెగ్యులర్ యాక్షన్ , సస్పెన్స్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి.. ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే.. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లోకి మంచి కంటెంట్ తో చాలానే సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. దాదాపు అందులో చూడదగిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి, ఎప్పుడు రెగ్యులర్ యాక్షన్, హర్రర్ సినిమాలు చూసి.. కాస్త రెఫ్రెషింగ్ సినిమాలను చూడాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ అంత కలిసి కూర్చుని చూసే మూవీస్ చాలా అరుదుగా వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమా ఈ కోవకు చెందిందే. ఈ వీకెండ్ ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేయండి. ఈ సినిమా మరేదో కాదు చైతన్య రావు నటించిన “డియర్ నాన్న” మూవీ. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ చూసిన వారికి ఈ హీరో గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అతనే చైతన్య రావు. ఈ మధ్య కాలంలో ఓటీటీ లో ఈ హీరో సినిమాలకు బాగానే బజ్ నడుస్తుంది. దీనితో ఇప్పుడు డియర్ నాన్న అనే సినిమాతో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చాడు చైతన్య రావు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు కానీ. ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని. ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక డియర్ నాన్న సినిమా జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ వారం ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి డియర్ నాన్న మూవీని ఎంజాయ్ చేసేయండి.

మరి ఈ సినిమా చూడాలంటే.. ఈ సినిమా కథేంటో కొంచెం అయినా తెలుసుకోవాల్సిందే.. ఈ సినిమా కథ విషయానికొస్తే. రవి అనే వ్యక్తి ఓ ఫార్మసిస్ట్.. అతను తన పని విషయంలో మాత్రం చాల నిక్ఖచ్చిగా ఉంటాడు. తన భార్య, కొడుకు సూర్య కోసం సరిపడా డబ్బు సంపాదిస్తూ.. ఉన్నంతలో వాళ్ళను సంతోషంగా చూసుకుంటాడు. తనలానే అతని కొడుకు కూడా ఆ పార్మాసిస్ట్ వృత్తిలో కొనసాగాలని అనుకుంటాడు. కానీ సూర్య మాత్రం మంచి చెఫ్ అవ్వాలని అనుకుంటాడు. మరి తన కొడుకు ఇష్టాన్ని తండ్రి అర్ధం చేసుకుంటాడా ! లేదా తండ్రి ఆశయాన్ని కొడుకు అర్ధం చేసుకుంటాడా! ఈ క్రమంలో వారి కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి.. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments