iDreamPost
android-app
ios-app

బాలయ్య ఫ్యాన్స్ కి క్రేజీ అప్ డేట్.. మళ్లీ మరోసారి అక్టోబర్ నుంచే!

  • Published Aug 08, 2024 | 6:15 PM Updated Updated Aug 08, 2024 | 6:15 PM

Balakrishna Unstoppable Season 4 Streaming Date: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే టాక్ షో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు తాజాగా నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Balakrishna Unstoppable Season 4 Streaming Date: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే టాక్ షో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు తాజాగా నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  • Published Aug 08, 2024 | 6:15 PMUpdated Aug 08, 2024 | 6:15 PM
బాలయ్య ఫ్యాన్స్ కి క్రేజీ అప్ డేట్.. మళ్లీ మరోసారి అక్టోబర్ నుంచే!

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రస్తుతం ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సారుల పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ మొత్తం ఒక తాటిమీదకు వచ్చి.. ఒక పెద్ద సెలబ్రేషన్ నిర్వహించబోతోంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన కర్టన్ రైజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇదే గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారికి మరో శుభవార్త అందుతోంది. బాలయ్య బాబు జోష్ ని వారం వారం ఎంజాయ్ చేసే అవకాశం మరోసారి రాబోతోంది. హీరోగా డైలాగులు చెప్పడం, సీనియర్ గా టీజ్ చేయడం, చిన్న పిల్లాడిలా స్టెప్పులేయడం చేసే ఎక్కడో కాదు.. అన్ స్టాపబుల్ షోలో. ఇప్పుడు ఆ షో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

బాలకృష్ణ హోస్ట్ అనగానే అందరూ పరి పరి విధాలుగా ఆలోచన చేశారు. అయితే వాటన్నింటిని పక్కకు తోస్తూ బాలయ్య హీరోగనానే కాకుండా.. ఒక హోస్టుగా అందరి హృదయాలను గెలుచుకున్నాడు. షోకి వచ్చే గెస్టులను ఆటపట్టిస్తూ.. వారిపై సరదా సరదా పంచులు వేస్తూ.. తన సినిమా అనుభవాలు, తీపి జ్ఞాపకాలను కూడా ప్రేక్షకులతో పంచుకుంటూ ఉండేవాడు. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మరో సీజన్ కి కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈసారి కూడా అక్టోబర్ నెల నుంచి ఈ సీజన్ ని స్టార్ట్ చేయాలి అని భావిస్తున్నారంట. దసరాకి అన్ స్టాపబుల్ సీజన్ 4ని స్టార్ట్ చేస్తారు అంటున్నారు. సెప్టెంబర్ నెలలో మూడో వారం నుంచి షూటింగ్ కూడా షురూ చేస్తారు అంటున్నారు.

ఈసారి పాన్ ఇండియా:

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తీసుకొచ్చిన అన్ స్టాపబుల్ సీజన్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించింది. ఓటీటీ కావడంతో.. ప్రేక్షకులకు చాలా త్వరగా రీచ్ అయ్యింది. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా అంటే పాన్ ఇండియా అనేస్తున్నారు. అలాగే బాలయ్య చేస్తున్న ఈ అన్ స్టాపబుల్ సీజన్ 4ని కూడా పాన్ ఇండియా చేస్తున్నారంట. టాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా.. కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ ని తీసుకొస్తారని చెబుతున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఒక బిగ్గెస్ట్ టాక్ షోగా అన్ స్టాపబుల్ ని మార్చాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ షోని అక్టోబర్ 12 నుంచి ప్రారంభిస్తారు అని టాక్ వినిపిస్తోంది. మరి.. అక్టోబర్ నుంచి అన్ స్టాపబుల్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet