చదువులు- ర్యాంకులు చుట్టూ సాగే సిరీస్.. OTTలో నవ్వుకోవడానికి రెడీ అయిపోండి?

OTT Telugu Web Series : ఓటీటీ ల జోరు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఓటీటీ లో లెక్కకు మించిన సినిమాలు , సిరీస్ లు ఉన్నాయంటే.. ఇంకా ఓటీటీ లోకి కొత్త సిరీస్ లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సిరీస్ వచ్చేస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

OTT Telugu Web Series : ఓటీటీ ల జోరు రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఓటీటీ లో లెక్కకు మించిన సినిమాలు , సిరీస్ లు ఉన్నాయంటే.. ఇంకా ఓటీటీ లోకి కొత్త సిరీస్ లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సిరీస్ వచ్చేస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఇపుడు ఓటీటీ లో లెక్కకు మించిన సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సినిమాలను ప్రేక్షకులు మిస్ చేయకూడదని.. ప్రతి వారం ఓటీటీ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి. వాటిలో ఏ సినిమాలు బావున్నాయి. అనే అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఇక వాటిలో ప్రేక్షకులు ముందు సెర్చ్ చేసేది.. తెలుగు కంటెంట్ కోసమే. దీనితో మేకర్స్ కూడా ప్రతి వారం డైరెక్ట్ గా ఓటీటీ లోకి కొత్త కంటెంట్ తో తెలుగు వెబ్ సిరీస్ లను రిలీజ్ చేస్తున్నారు. వాటికి విశేష ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ వెబ్ సిరీస్ పేరు… “ఎయిర్”. ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన న్యూస్ చూసే ఉంటారు. ఎయిర్ ఫుల్ ఫార్మ్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ సిరీస్ డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాగా ఈ సిరీస్ కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. కాగా ఈ సిరీస్ లో హర్షరోషణ్, భాను ప్రతాప్, జయతీర్థ, సింధు రెడ్డి, వైవా హర్ష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని సమాచారం. ఇక ఈ మూవీని దీపావళికి అంటే అక్టోబర్ చివరి వారంలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ విషయం ఈ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న సందీప్ రాజ్ స్వయంగా తెలియజేశారు. ” దీపావళికి టపాసులు మాత్రమే కాదు. నవ్వులు.. కన్నీళ్లు బోనస్‍గా వస్తాయి” అంటూ ఓ పోస్ట్ చేశారు. ఇక ఎయిర్ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే.. ఇది చాలా మంది విధ్యార్థులకు కనెక్ట్ అవుతుంది. ఐఐటీ లలో సీట్ సాదించేందుకు.. విధ్యార్థులు పడే కష్టాలు చుట్టూ ఈ సిరీస్ కథ కొనసాగుతుంది. సాధారణంగా ఐఐటి లలో సీట్ సాధించడం కోసం.. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురౌతున్నారో తెలియనిది కాదు. ఇక అదే పాయింట్ ను ప్రధాన అంశంగా ఈ సిరీస్ లో చూపించనున్నారు. మరి ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments