Nidhan
Ghoomer Movie OTT Streaming Details: విధిని ఎదిరించి విజేతగా నిలిచిన ఓ అమ్మాయి కథతో తెరకెక్కిన చిత్రమే ‘ఘూమర్’. ఈ బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Ghoomer Movie OTT Streaming Details: విధిని ఎదిరించి విజేతగా నిలిచిన ఓ అమ్మాయి కథతో తెరకెక్కిన చిత్రమే ‘ఘూమర్’. ఈ బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
స్పోర్డ్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంది. ఇలాంటి సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇవి చాలా అరుదుగా వస్తుంటాయి. మిగతా ఇండస్ట్రీల కంటే బాలీవుడ్ ఇలాంటి చిత్రాలు తీయడంలో ఆరితేరిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘83’ లాంటి పలు సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మూవీస్ అక్కడి నుంచే వచ్చాయి. ఇవి నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్స్. కానీ క్రీడా నేపథ్యంతో సాగుతూ ఆడియెన్స్‌కు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించాయి. అలాంటి బాలీవుడ్ నుంచి వచ్చిన మరో చిత్రమే ‘ఘూమర్’. విధిని ఎదిరించిన ఓ అమ్మాయి కథతో సాగుతుందీ సినిమా.
క్రికెట్ బ్యాటే ప్రపంచంగా పెరిగిన అనికా దీక్షిత్ (సయామీ ఖేర్) అనే అమ్మాయి భారత జట్టుకు ఆడాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఎంతో శ్రమిస్తుంది. ఆఖరికి టీమిండియాకు సెలెక్ట్ అవుతుంది. అయితే ఇంకొన్ని రోజుల్లో తొలి మ్యాచ్ ఆడుతుందనగా ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది. ఈ ప్రమాదంలో ఆమె తన కుడి చేతిని కోల్పోతుంది. బ్యాటింగ్ చేసే చేతిని కోల్పోవడంతో తన పనైపోయిందని, ఇక డ్రీమ్‌ను నెరవేర్చుకోలేనని నిరాశతో కుంగిపోతుంది. అప్పుడు ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇస్తాడు మాజీ క్రికెటర్ ప్యాడీ (అభిషేక్ బచ్చన్). అనికాకు ప్యాడీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆమె బ్యాటర్ నుంచి బౌలర్‌గా ఎలా మారింది? ఒక్క చేతితో బౌలింగ్ చేస్తూ టీమిండియాకు ఎలా ఎంపికైంది? అనేదే మిగిలిన కథ.
ఒక మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని ఈ సినిమా ద్వారా చెప్పేందుకు ప్రయత్నించారు డైరెక్టర్ ఆర్. బాల్కీ. సెన్సిబుల్ సబ్జెక్ట్స్‌తో చిత్రాలు తీసే ఆయన ‘ఘూమర్’ ద్వారా మరోమారు ఆకట్టుకున్నారు. ఓడిపోయాం, ఇక అంతా అయిపోయిందనే సిచ్యువేషన్ నుంచి లేచి నిలబడి, విజయానికి కొత్త మార్గాలను అన్వేషించడం, డ్రీమ్స్‌ను నెరవేర్చుకునే ప్రయత్నంలో నెవర్ గివప్ అంటూ పోరాడటం ఎలాగో ‘ఘూమర్’ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. గతేడాది విడుదలైన ఈ ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ మూవీ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. క్రీడల్ని ఇష్టపడేవారితో పాటు నార్మల్ మూవీ లవర్స్ కూడా ఈ ఫిల్మ్‌ను చూస్తే కన్నీళ్లు పెట్టుకోక మానరు. ఇందులో సయామీ ఖేర్, అభిషేక్ బచ్చన్ యాక్టింగ్ మిమ్మల్ని హంట్ చేస్తాయి. మరి.. ‘ఘూమర్’ను చూసేందుకు మీరెంత ఆసక్తిగా ఉన్నారో కామెంట్ చేయండి.