iDreamPost
android-app
ios-app

సినీ ఇండస్ట్రీలో కనక వర్షం! ఈ డబ్బు అంతా పుష్ప మిస్ అయ్యాడు!

Pushpa 2 Movie- Lost Good Opportunity On Long Weekend: ఐకాన్ స్టార అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా ఈ ఆగస్టు 15కి విడుదల కావాల్సింది. కానీ, డిసెంబర్ 6కు వాయిదా వేసుకున్నారు. అయితే ఈ లాంగ్ వీకెండ్ లో మంచి ఛాన్స్ మిస్ అయ్యారు.

Pushpa 2 Movie- Lost Good Opportunity On Long Weekend: ఐకాన్ స్టార అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా ఈ ఆగస్టు 15కి విడుదల కావాల్సింది. కానీ, డిసెంబర్ 6కు వాయిదా వేసుకున్నారు. అయితే ఈ లాంగ్ వీకెండ్ లో మంచి ఛాన్స్ మిస్ అయ్యారు.

సినీ ఇండస్ట్రీలో కనక వర్షం! ఈ డబ్బు అంతా పుష్ప మిస్ అయ్యాడు!

టాలీవుడ్ లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఆగస్టు నెల జాక్ పాట్ లా మారిపోయింది. లాంగ్ వీకెండ్ పుణ్యమా అని సినిమా ప్రేక్షకులకు జాతరలాంటి వాతావరణం ఏర్పడింది. వరుసగా 5 రోజుల వరకు సెలవులు ఉండటంతో సినిమాలు మొత్తం ఈ వీకెండ్ ని టార్గెట్ చేసుకున్నాయి. ఆగస్టు 15న విడుదలైన సినిమాలు అన్నింటికి కాసుల వర్షం కురిసింది. నిజానికి సినిమా బాగున్నా.. డివైడ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. అది వీకెండ్ మహిమ అనే చెప్పాలి. అయితే ఈ మొత్తం బిజినెస్ ని పుష్ప 2 మిస్ చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే అందరికంటే ముందు ఆగస్టు 15 డేట్ ని లాక్ చేసుకుంది పుష్ప టీమ్. కానీ, వాళ్లు మూవీ వర్క్ పూర్తి కాలేదు అని రిలీజ్ ని డిసెంబర్ కు మార్చుకున్నారు.

లాంగ్ వీకెండ్ మ్యాజిక్:

ఆగస్టు 15 నుంచి ఆగస్టు 19 వరకు దాదాపుగా అందరికీ సెలవులు వచ్చేశాయి. ఏ సినిమా రిలీజ్ అయినా కూడా మహా అయితే శుక్రవారం రిలీజ్ చేస్తారు. అంటే కేవలం మూడ్రోజులు మాత్రమే వీకెండ్ కిందకు కౌంట్ అవుతుంది. కానీ, ఈసారి ఏకంగా 5 రోజులు సెలవులు ఉండటంతో.. సినిమాలకు కనక వర్షం కురిసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే రిలీజ్ అయిన అన్నీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఫీడ్ బ్యాక్, రివ్యూలు, ఒపీనియన్స్ ఇవేమీ పట్టించుకోకుండా.. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అటు బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమాకి కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ రెండ్రోజుల్లోనే ఏకంగా రూ.118 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.

పుష్ప 2 మిస్:

ఇలాంటి తరుణంలో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 గనుక వచ్చి ఉంటే.. ఏ స్థాయి కలెక్షన్స్ రాబట్టేదో? ఎన్ని రికార్డులను బద్దలు కొట్టేదో ఊహించడం కూడా కష్టమనే చెప్పాలి. ముందు నుంచి చెప్పినట్లుగా పుష్ప 2 సినిమాని ఆగస్టు 15కి తీసుకొచ్చి ఉంటే.. ఇంత మంచి బిజినెస్ ని ఎన్ క్యాష్ చేసుకునేవాళ్లు. పుష్ప 2 ఉన్నప్పుడు ఇన్ని సినిమాలు రిలీజ్ కి రాలేదు. బాలీవుడ్ లో కూడా కొన్ని వెనక్కి తగ్గాయి. ఇంక టాలీవుడ్ లో అయితే ఎవరూ పుష్పరాజ్ తో పోటీకి రాలేదు. ఎప్పుడైతే పుష్ప 2 సినిమా బరి నుంచి తప్పుకుందో.. అందరూ రేసులోకి వచ్చేశారు. ఏది ఏమైనా కూడా ఈ లాంగ్ వీకెండ్ కి పుష్పరాజ్ వచ్చి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ లాంగ్ వీకెండ్ విన్నర్ మాత్రం స్త్రీ 2 అనే చెప్పాలి. మరి.. ఈ సినిమా జాతరలో మిమ్మల్ని ఏ సినిమా మెప్పించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.