Tirupathi Rao
Netflix OTT Suggestions: ప్రపంచ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ మొత్తాన్ని ఉర్రూతలాగించిన రెండు యాక్షన్ థ్రిల్లర్స్ వచ్చేశాయి. వాటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
Netflix OTT Suggestions: ప్రపంచ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ మొత్తాన్ని ఉర్రూతలాగించిన రెండు యాక్షన్ థ్రిల్లర్స్ వచ్చేశాయి. వాటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
Tirupathi Rao
ఓటీటీల్లోకి చాలా చిత్రాలు వస్తాయి. కానీ, కొన్ని చిత్రాలు మాత్రం ఆడియన్స్ ని మాత్రమే కాదు.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ యాజమాన్యాన్ని కూడా థ్రిల్ కి, ఎగ్జైట్మెంట్ కి గురి చేస్తాయి అలాంటి వాటిలో ఈ చిత్రం కూడా ఒకటి. ఈ మూవీ కేవలం ప్రేక్షకులనే కాదు.. ఏకంగా అకాడెమీ అవార్డ్స్ జ్యూరీని కూడా మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రానికి ఏకంగా 11 ఆస్కార్ అవార్డులు కూడా దక్కాయి. అలాంటి చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతోంది. మరి.. ఆ చిత్రం ఏంటి? అసలు ఆ మూవీకి ఎందుకంత క్రేజ్? అలాంటి చిత్రం ఇన్నాళ్లు ఎందుకు ఓటీటీలోకి రాలేదు? అనే విషయాలు తెలుసుకుందాం.
ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రం పేరు లార్డ్ ఆఫ్ ది రింగ్స్: రిటర్న్ ఆఫ్ ది కింగ్ మూవీ. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో మొత్తం 3 చిత్రాలు ఉన్నాయి. మొదటిది ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్. ఈ చిత్రం 2001లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆ రింగ్ కథ మొదలవుతుంది. చిత్రం ఎండింగ్ లో ట్రియాలజీ స్టార్ట్ అవుతుంది. రెండో చిత్రం ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది టూ టవర్స్. ఈ మూవీ 2002లో విడుదలైంది. ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చిందే సిరీస్ లో ఆఖరి చిత్రం ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: రిటర్న్ ఆఫ్ ది కింగ్ మూవీ. ఇది 2003లో విడుదలైంది. ఈ చిత్రానికి ఏకంగా 11 ఆస్కార్ అవార్డులు దక్కాయి.
ఈ మూడు చిత్రాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఈ మూడు చిత్రాలను దాదాపుగా న్యూజిలాండ్ లో షూట్ చేశారు. కొన్ని ప్రదేశాలు మాత్రం గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశారు. ఈ 3 చిత్రాలు మొత్తం 30 ఆస్కార్స్ విభాగలకు నామినేట్ అవ్వగా.. 17 ఆస్కార్స్ గెలుచుకున్నాయి. వీటిలో 11 ఆస్కార్స్ లాస్ట్ మూవీకి దక్కాయి. ఈ మూవీ సిరీస్ లో ఇంకో స్పెషల్ ఏంటంటే.. థియేటర్లో మీకు చూపించే సినిమా కంటే.. డీవీడీలో ఎక్కువ మూవీ ఉంటుంది. ఈ మూడు చిత్రాలు కలిపి మొత్తం 11 గంటలు నిడివి ఉంటుంది. వీటిని నిర్మించడానికి 281 మిలియన్ డాలర్స్ ఖర్చుకాగా.. ఏకంగా 3 బిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టాయి. ఈ మూడు చిత్రాల్లో మొత్తం 3500 స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ, మూవీ మాత్రం దాదాపుగా రియలిస్టిక్ గానే ఉంటుంది. ఈ మూవీ సిరీస్ కి ప్రీక్వెల్ గా అమెజాన్ ప్రైమ్ ది రింగ్స్ ఆఫ్ పవర్ అనే సిరీస్ ని కూడా నిర్మించింది. అది కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.
ఈ మూడు చిత్రాల్లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలో షిప్ ఆఫ్ ది రింగ్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ అనే రెండు చిత్రాలు మార్చి 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంత గొప్ప చిత్రాలు ఓటీటీలోకి రాలేదా అంటే? అమెజాన్ ప్రైమ్ లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూడు చిత్రాలు, ది రింగ్స్ ఆఫ్ పవర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాలను తమ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తోంది. ఇన్నాళ్లు మీరు గనుక.. ఈ సినిమాలను మిస్ అయి ఉంటే తప్పకుండా చూసేయండి. యాక్షన్ చిత్రాలను ఇష్ట పడేవారికి అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ని ఇస్తాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఏదో ఒక ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాలను ఒకసారి చూసేయండి. మరి.. మీర ఇప్పటికే ఈ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చిత్రాలు చూసుంటే.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.