P Krishna
Thriller Movies: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఓటీటీ దున్నేస్తుంది.. వారం వారం వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఏలాంటి మూవీ, వెబ్ సీరీస్ అయిన ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.
Thriller Movies: ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఓటీటీ దున్నేస్తుంది.. వారం వారం వచ్చే కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఏలాంటి మూవీ, వెబ్ సీరీస్ అయిన ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.
P Krishna
ఒకప్పడు థియేటర్ల వద్ద బారులు తీరి టికెట్ల కోసం కొట్టుకునే కాలం పోయింది.. ఇంట్లో హ్యాపీగా కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు సగటు ప్రేక్షకుడు. ఓటీటీ పుణ్యమా ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త శకం ప్రారంభం అయ్యింది. కొంతమంది దర్శక, నిర్మాతలు కొత్త సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, హర్రర్ జోనర్ లో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. విచిత్రం ఏంటంటే థియేటర్లో హిట్ కాని సినిమాలు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ సంపాదిస్తున్నాయి.థ్రిల్లర్ మూవీస్ చూసి ఎంజాయ్ చేసేవారికి గుడ్ న్యూస్.. ఈ 13 సినిమాలు అస్సలు మిస్ కావొద్దు.వివరాల్లోకి వస్తే..
బద్లా మూవీ( నెట్ ఫ్లిక్స్) :
బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘బద్లా’. వాస్తవానికి ఇది స్పానిష్ మూవీ ‘ద ఇన్విజిబుల్ గెస్ట్’ ప్రేరణతో తీశారు. ఈ మూవీ రిలీజ్ అయిన నలభై ఏళ్లు అవుతున్నా..ఉత్కంఠభరితంగా సాగే ఈ మూవీకి ఇంకా క్రేజ్ తగ్గలేదు.
సంఘర్ష్ మూవీ (అమెజాన్ ప్రైమ్ వీడియో):
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సంఘర్ష్’ రిలీజ్ అయిన కొద్ది రోజులకు విపరీతమైన క్రేజ్ సంపాదించింది. సైకో, ఇన్వెస్టిగేటర్, ప్రొఫెసర్ మూడు పాత్రలతో నడిచే కథ అద్భుంగా తీశారు.
దృశ్యం మూవీ (అమెజాన్ ప్రైమ్ వీడియో):
మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. అజయ్ దేవగన్, టబూ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ ఆస్వాదించే ప్రేక్షకులకు బాగా నచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తక బిడ్డ కోసం ఓ తండ్రి పడే ఆవేదన ఈ సినిమాలో చూపించారు.
గుమ్నాం మూవీ(అమేజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్) :
ఎనిమిది మంది వ్యక్తులు ఒక భయంకరమైన ఐలాండ్ లో చిక్కుకుపోతారు.. ఒక్కొక్కరుగా చనిపోతుంటార. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే ఈ మూవీని రాజా నవతే దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ మూవీ బాలీవుడ్ లో క్రైమ్ థ్రిల్లర్ గా ట్రెండ్ సృష్టించింది.
16 డిసెంబర్ మూవీ (అమెజాన్ ప్రైమ్ వీడియో,యూట్యూబ్):
2002లో మణిశంకర్ దర్శకత్వంలో మిలింద్ సోమన నటించిన సూపర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. భారత దేశ రాజధాని ఢిల్లీని అనుబాంబు తో నాశనం చేయాలన్న పన్నాగం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సెన్సేషన్ హిట్ అయ్యింది.
కహానీ మూవీ (అమెజాన ప్రైమ వీడియో):
తన భర్త కనిపించకుండా పోవడంతో భార్య లండన్ నుంచి కోల్‌కొతా కి వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఎన్ని కష్టాలు పడుతుంది. కానీ చివరిల్లో ఊహించని మలుపు తిరుగుతుంది. విద్యా బాగ్చీ పాత్రలో విద్యాబాలన్ అద్భుతంగా నటించి విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకున్నారు.
డర్ (అమెజాన్, యూట్యూబ్, యూపిల్ టివీ +):
బాలీవుడ్ బాద్ షా కెరీర్ బిగినింగ్ లో వచ్చిన అద్భుతమైన చిత్రం. ఈ మూవీలో నెగిటీవ్ పాత్రలో కనిపిస్తాడు. సన్నీడియోల్, జూహి చావ్లా నటించిన ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ యశ్ చోప్రా తెరకెక్కించారు.
అజ్నబీ మూవీ (డిస్నీ+హాట్ స్టార్) :
బాలీవుడ్ భారీ తారాగణంతో అబ్బాస్ – ముస్తాన్ తెరకెక్కించిన ‘అజ్నబీ మూవీ’ అప్పట్లో ప్రేక్షకులను బాగా అలరించింది. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అప్పట్లో ప్రేక్షకులను బాగా అలరించింది.
మహాల్ మూవీ (యూట్యూబ్):
1920 లో తీసిన జర్మన్ మూవీ ‘ద గోలెమ్’ ప్రేరణగా తీసిన ‘మహల్’ మూవీ 1947 లో తీశారు. అప్పట్లోనే రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను బాగా ఎంట్రటైన్ చేసిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.