iDreamPost
android-app
ios-app

16 నెలల తర్వాత ఓటీటీలోకి ‘భార్గవి నిలయం’!..స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Crime Thriller Series - Bhargavi Nilayam OTT Streaming Date: ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది. చిన్న సినిమాలైన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సైతం టాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మలయాళంకు చెందిన ఓ హరర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Crime Thriller Series - Bhargavi Nilayam OTT Streaming Date: ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది. చిన్న సినిమాలైన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సైతం టాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మలయాళంకు చెందిన ఓ హరర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

16 నెలల తర్వాత ఓటీటీలోకి ‘భార్గవి నిలయం’!..స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

ఓటీటీ వచ్చిన తరువాత అన్ని భాషల సినిమాలను చూసే అవకాశం వచ్చింది.. అలానే తెలుగులో సైతం తమిళ, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినిమాలు డబ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కొన్ని మలయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి..నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. గతంలో హిటైన, మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాలను డబ్ చేసి..ఓటీటీల్లో సినీ ప్రియులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వర్షన్ లో భార్గవి నిలయం పేరుతో రానుంది. మరీ..ఎక్కడ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

 మలయాళంలో తెరకెక్కిన ‘నీలవెలిచం’ అనే హారర్ థ్రిల్లర్ సినిమాను తెలుగు వెర్షన్‍లో భార్గవి నిలయం పేరుతో రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఓటీటీ ప్రకటించింది. గతేడాది ఏప్రిల్ 20వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలై మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 16 నెలల తరువాత తెలుగు వర్షన్ లో సందడి చేయనుంది. భార్గవి నిలయం పేరుతో ఈ సినిమా తెలుగులో రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. భార్గవి నిలయం సినిమా సెప్టెంబర్ 5వ తేదీన ఆహా స్ట్రీమింగ్‍ కానుంది. ఇదే విషయాన్ని అహా అధికారికంగా ప్రకటించింది. “భార్గవి నిలయంతో ఎంటర్‌టైన్‍ చేసేందుకు మన టొవినో థామస్ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 5న ఆహాలో ప్రీమియర్ కానుంది” అని ఆహా ట్విట్ చేసింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. టొవినో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో కీలక నటించారు. ఈ మూవీకి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. నీలవెలిచం మూవీకి బిజిబాల్, రెక్స్ విజయన్, ఎంఎస్ బాబు రాజ్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు. ఓపీఎం సినిమాస్ పతాకంపై ఆషికీ అబు, రీమా కలింగల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళంలో కంటే ముందు ఈ సినిమా 1960 కన్నడలో ‘భార్గవి నిలయం’ పేరుతో తెరకెక్కింది. ఆ సినిమాకు రీమేక్‍గా 2023లో మలయాళంలో నీలవెలిచం రూపొందింది. ఈ మలయాళ మూవీని తెలుగులో డబ్ చేసి.. భార్గవి నిలయం పేరుతోనే ఆహాలోకి వస్తోంది. ఓ పాడుపడిన బంగ్లాలో ఆత్మ తిరగడం, ఆ ఫ్లాష్‍బ్యాక్, ప్రేమ కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హారర్  సీన్స్ ఈ మూవీలో ఆకట్టుకున్నాయనే సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తమయ్యాయి. మరి.. తెలుగు ఓటీటీలో ఏ మేర ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.