Tirupathi Rao
Mahesh Babu Suggested Web Series: సూపర్ స్టార్ మహేశ్ బాబు మెచ్చిన ఈ వెబ్ సిరీస్ మీరు చూశారా? ఒక్కో ఎపిసోడ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుంది.
Mahesh Babu Suggested Web Series: సూపర్ స్టార్ మహేశ్ బాబు మెచ్చిన ఈ వెబ్ సిరీస్ మీరు చూశారా? ఒక్కో ఎపిసోడ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుంది.
Tirupathi Rao
సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోగా అందరికీ తెలుసు. అలాగే సమాజ సేవ చేసే ఒక సమాజిక ధృక్పథం కలిగిన గొప్ప వ్యక్తిగా కూడా అందరికీ పరిచయమే. కానీ, మహేశ్ బాబులో ఒక మంచి రివ్యూయర్ ఉన్నాడని చాలా తక్కువ మందికి తెలుసు. తాను చూసిన.. తనకు బాగా నచ్చిన సినిమాలు, సిరీస్ ల గురించి మహేశ్ బాబు ఒక షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అలా తాజాగా ఒక వెబ్ సిరీస్ గురించి తన రివ్యూ చెప్పాడు. ఆ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఇండియాలోనే ట్రెండింగ్ 1లో ఉంది. మరి.. ఆ సిరీస్ ఏంటి? అందులో అంత గొప్పగా ఏముందో చూద్దాం.
సూపర్ స్టార్ మహేశ్ బాబు అంతగా పొగిడిన, రివ్యూ ఇచ్చిన వెబ్ సిరీస్ పేరు పోచర్. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ లో ఈ చిత్రం ప్రస్తుతం ఇండియాలోనే ట్రెండింగ్ 1లో ఉంది. ఈ సిరీస్ గురించి మహేశ్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే.. “ఎవరైనా అలాంటి పనులు ఎలా చేస్తారు? వారి చేతులు వణకవా? అమెజాన్ ప్రైమ్ లో పోచర్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నా మైండ్ లోకి ఇలాంటి ప్రశ్నలే వచ్చాయి. ఈ అద్భుతమైన జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది” అంటూ మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
సాధారణంగానే వైరల్ అవుతున్న ఈ వెబ్ సిరీస్.. మహేశ్ రివ్యూ ఇచ్చిన తర్వాత మరింత ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సిరీస్ ని యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కేరళ అడవుల్లో జరిగిన ఏనుగుల వేట, ఏనుగు దంతాల అక్రమ రవాణా, వాటిని అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు చేసిన రిస్కీ ఆపరేషన్స్ ని ఒక వెబ్ సిరీస్ రూపంలో నిర్మించారు. దీనిని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నిర్మించడం మరో విశేషం. ఫిబ్రవరి 23 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇందులో ఆలియా భట్ కూడా కీలక పాత్ర పోషిచింది.
కేరళలోని మలయత్తు అడవుల్లో జరిగిన కథలా దీనిని చూపించారు. అక్కడ అటవీశాఖలో ఒక కింది స్థాయి ఉద్యోగి తాను ఏనుగుల వేటలో భాగస్వామిని అయ్యాను అంటూ లొంగిపోతాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడ ఏనుగుల వేట జరుగుతున్న విషయం వెలుగులోకి వస్తుంది. రాష్ట్రాన్నే ఆ కేసు ఒక ఊపు ఊపేస్తుంది. మొత్తం 18 ఏనుగులు వేటాడబడినట్లు గుర్తిస్తారు. పరిస్థితులు చేజారిపోకుండా ఉండేందుకు పోలీసులు, అటవీ అధికారులు కలిసి జాయింట్ యాక్షన్ చేపడతారు.
ఈ మొత్తం వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టాలి అని నిర్ణయించుకుంటారు. బార్డ్స్ శాంచురీలో వర్క్ చేసే మాలా అనే టాలెంటెడ్ అధికారిని టీమ్ లోకి తీసుకుంటారు. ఈ టీమ్ ప్రధాన లక్ష్యం ఏనుగులను వేటాడే వాళ్లను కటకటాల వెనక్కు పంపడమే. వీళ్ల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దర్యాప్తు చేస్తూ ఉంటారు. కేరళలో మొదలైన ఈ టీమ్ ప్రయాణం.. ఢిల్లీ వరకు వెళ్తుంది. మరి.. ఆ వేటగాళ్లను పట్టుకున్నారా? ఈ ఆపరేషన్ లో అధికారులకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరికి ఏనుగులను కాపాడారా? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోచర్ సిరీస్ చూడాల్సిందే.