iDreamPost
android-app
ios-app

హిస్టరీలోనే భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. దీని కాస్ట్ తో 4 సినిమాలు తీయొచ్చు..!

  • Published Feb 08, 2024 | 5:20 PM Updated Updated Feb 08, 2024 | 5:20 PM

ప్రస్తుతం ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో వస్తున్న సినిమాల కంటే కూడా.. వెబ్ సిరీస్ వైపే అందరి దృష్టి మళ్లుతోంది. దీనితో తక్కువ బడ్జెట్ తో తీయగలిగే వెబ్ సిరీస్ లకు కూడా భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వెబ్ సిరీస్ ను సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొందించారట . ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో వస్తున్న సినిమాల కంటే కూడా.. వెబ్ సిరీస్ వైపే అందరి దృష్టి మళ్లుతోంది. దీనితో తక్కువ బడ్జెట్ తో తీయగలిగే వెబ్ సిరీస్ లకు కూడా భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వెబ్ సిరీస్ ను సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొందించారట . ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Published Feb 08, 2024 | 5:20 PMUpdated Feb 08, 2024 | 5:20 PM
హిస్టరీలోనే భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. దీని కాస్ట్ తో 4 సినిమాలు తీయొచ్చు..!

ప్రస్తుతం చూస్తున్నట్లైతే.. తీసే ప్రతి సినిమాకు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు మేకర్స్. చిన్న చిన్న సినిమాలు కూడా బడ్జెట్ ను పెంచేస్తున్నారు. ఇక పెద్ద సినిమాల గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం రూ.150 కోట్లు లేనిదే ఓ సినిమాను కంప్లీట్ చేయడం కష్టం. ఇక రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ బడ్జెట్ అయితే అంతే ఉండదు. సినిమాల విషయం ఎలా ఉన్నా .. ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు .. వెబ్ సిరీస్ లకు కూడా బాగా ఆదరణ పెరిగిపోతుంది. దీనితో తాజాగా ఓ వెబ్ సిరీస్ ను అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిచారట. భారీ బడ్జెట్ అంటే అంత ఇంత కాదు.. ఏకంగా పెద్ద పెద్ద మూవీ డైరెక్టర్ల చిత్రాల బడ్జెట్ నే క్రాస్ చేసిందట .. ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ . అసలు ఆ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఏంటి ? దానికోసం ఎంత బడ్జెట్ కేటాయించారు ? అనే వివరాలు తెలుసుకుందాం.

ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత.. వెబ్ సిరీస్ లకు పెరిగి ఆదరణ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఎన్నో వెబ్ సిరీస్ లు ఓటీటీలలో అందుబాటులో ఉన్నాయి.వెండి తెరపై నటించిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు కూడా .. ఓటీటీలలో నటించేందుకు ఏ మాత్రం వెనుక అడుగు వేయట్లేదు. ఈ క్రమంలో.. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ .. సంజయ్ లీల భన్సాలీ హిందీలో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ పేరు “హీరా మండీ”. ఈ వెబ్ సిరీస్ నే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఇప్పటివరకు వచ్చిన అన్ని భాషల వెబ్ సిరీస్ లలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న.. మొదటి వెబ్ సిరీస్ ఇదే. దీనితో ప్రస్తుతం అంతటా ఈ వెబ్ సిరీస్ కు కేటాయించిన బడ్జెట్ పైనే చర్చలు జరుగుతున్నాయి.

సాధారణంగా సంజయ్ భన్సాలీ సినిమాలకు ఉండే క్రేజ్ తెలిసిందే. మామూలుగానే సంజయ్ చిత్రాలకు చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే ఇప్పుడు ఈ డైరెక్టర్ రూపొందిస్తున్న వెబ్ సిరీస్ కు కూడా అంతే గ్రాండ్ గా ప్లాన్ చేశారు. “హీరామండీ” వెబ్ సిరీస్ కు దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట. రాజమౌళి రూపొందించిన బాహుబలి-1 చిత్రం కంటే కూడా.. ఎక్కువ బడ్జెట్ తో వస్తుంది ఈ వెబ్ సిరీస్. కాగా, ఈ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ తెలుసుకున్న నెటిజన్లు .. దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఓ వెబ్ సిరీస్ కు ఈ రేంజ్ బడ్జెట్ ను కేటాయించడం అంటే.. ఆలోచించాల్సిన విషయమే. మరి, ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş