iDreamPost
android-app
ios-app

ఫిబ్రవరిలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్ లు ఇవే!

  • Published Feb 01, 2024 | 9:36 PM Updated Updated Feb 01, 2024 | 9:36 PM

Disney Plus Hotstar February Releases: ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త సినిమాలు ఏమొచ్చాయి? కొత్త సిరీస్లు ఏం రిలీజ్ అయ్యాయని వెతుకుతూనే ఉంటారు. వారి కోసమే ఈ లిస్ట్.

Disney Plus Hotstar February Releases: ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త సినిమాలు ఏమొచ్చాయి? కొత్త సిరీస్లు ఏం రిలీజ్ అయ్యాయని వెతుకుతూనే ఉంటారు. వారి కోసమే ఈ లిస్ట్.

  • Published Feb 01, 2024 | 9:36 PMUpdated Feb 01, 2024 | 9:36 PM
ఫిబ్రవరిలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, సిరీస్ లు ఇవే!

ఫిబ్రవరి నెల థియేటర్లలో సినిమాల జాతర ఉంది. ఫిబ్రవరి 2వ తేదీనే థియేటర్లలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే అవన్నీ చిన్న సినిమాలు కాబట్టి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూయించడం లేదు. ఓటీటీల్లోకి ఈ నెల ఏ సినిమాలు రాబోతున్నాయి అంటూ ఎదురుచూపులు, వెతుకులాటలు మొదలు పెట్టేశారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే హాట్ స్టార్ లో ఈ నెల అదిరిపోయే వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. సిరీస్లు ఇష్టపడే వారికి ఇవి బాగా నచ్చేస్తాయి కూడా. అయితే అసలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏ ఏ వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి? వాటిలో అస్సలు మిస్ కాకూడని సిరీస్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం.

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్:

లావణ్య త్రిపాఠి అడపాదడపా సిరీస్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అమ్మడు పులిమేక సిరీస్ తో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా మిస్ పర్ఫెక్ట్ సిరీస్ తో రాబోతోంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఓసీడీ ఉన్న అమ్మాయిగా లావణ్య కనిపిస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ ఈ సిరీస్ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ది మార్వెల్స్ మూవీ:

మార్వెల్స్ యూనివర్స్ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ సూపర్ హీరోల మూవీస్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ లేడీ సూపర్ హీరోస్ నటించి ది మార్వెల్స్ అనే చిత్రం నవంబరులో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఫిబ్రవరి 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఆర్య సీజన్ 3:

సుష్మితా సేన్ నటించిన ఆర్య సిరీస్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా మూడో సీజన్ ఆర్య అంతిమ్ వార్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. డ్రగ్ మాఫియా చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

షోగన్ సిరీస్:

షోగన్ అనేది జపనీస్ వెబ్ సిరీస్. ఓటీటీలు వచ్చిన తర్వాత భాష ఏదైనా కంటెంట్ లో విషయం ఉంటే తెలుగు ప్రేక్షకులు చూసేస్తున్నారు. అలాంటి వారికి ఈ షోగన్ కూడా మెప్పించే సిరీస్ అవుతుంది. 2018లో వచ్చిన షోగన్ నవల ఆధారంగా ఈ హిస్టారికల్ డ్రామా సిరీస్ ని తెరకెక్కించారు. 17వ శతాబ్దపు జపాన్ ను కళ్లకు కట్టినట్లు చూయించారు. ఫిబ్రవరి 27 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఇవి మాత్రమే హాట్ స్టార్ ఫిబ్రవరి రిలీజెస్ లో ఉన్నాయి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş