iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి ‘ముంజుమెల్ బాయ్స్’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

  • Published Mar 31, 2024 | 11:58 AMUpdated Mar 31, 2024 | 11:58 AM

Manjummel Boys OTT Release: ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఇష్టపడుతున్నారు.

Manjummel Boys OTT Release: ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఇష్టపడుతున్నారు.

  • Published Mar 31, 2024 | 11:58 AMUpdated Mar 31, 2024 | 11:58 AM
ఓటీటీలోకి  ‘ముంజుమెల్ బాయ్స్’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే?

ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఏలుతుంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. ఒకప్పుడు ధియేటర్లో తమ అభిమాన హీరోల సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, హర్రర్, కామెడీ జోనర్లో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘ముంజుమెల్ బాయ్స్’ఓటీటీలోకి రాబోతుంది. ఎప్పుడు? స్రీమింగ్ ఎక్కడ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ లో వచ్చిన లెటెస్ట్ హిట్ మూవీ  ‘మంజ్నుమ్మెల్ బాయ్స్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.  ఫిబ్రవరి 22న ధియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లు సాధించింది.  ఇప్పటి వరకు ఈ మూవీ రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు చేసింది. తమిళంలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 4 న ఈ మూవీ తెలుగు లో రిలీజ్ కాబోతుంది. తాజాగా   ‘మంజ్నుమ్మెల్ బాయ్స్’ ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మలయాళంలో ఏప్రిల్ 5 నుంచి అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Munjumel Boys into OTT

మరోవైపు ఈ మూవీ తెలుగు లో మైత్రీ మూవీస్ ఏప్రిల్ 6వ తేదీన తెలుగు లో రిలీజ్ చేయబోతుంది. ఈ విషయం ఇప్పటికే అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు ఈ మాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూాడాలి.  ఇక్కడ కూడా భారీ వసూళ్లు చేస్తాయని అంచనాలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి