iDreamPost
android-app
ios-app

Manjummel Boys OTT: అఫీషియల్: మంజుమ్మేల్ బాయ్స్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

  • Published Apr 27, 2024 | 1:55 PMUpdated Apr 27, 2024 | 1:55 PM

మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి తెలియనిది కాదు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి తెలియనిది కాదు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

  • Published Apr 27, 2024 | 1:55 PMUpdated Apr 27, 2024 | 1:55 PM
Manjummel Boys OTT: అఫీషియల్: మంజుమ్మేల్ బాయ్స్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

నిన్న మొన్నటి వరకు ఎక్కడ చూసిన ఈ మలయాళ సినిమాల గురించే టాక్ నడించింది. థియేటర్స్ లో ప్రేమలు సినిమా క్రియేట్ చేసిన మ్యాజిక్ తర్వాత.. మలయాళీ సూపర్ సక్సెస్ సాధించిన సినిమా మంజుమ్మేల్ బాయ్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కూడా ఊహించిన విధంగానే మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ కు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు కానీ ఓటీటీ ఎంట్రీ గురించి మాత్రం.. రకరకాల డేట్స్ , బజ్ నడించింది. దీనితో ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి ఆశలు వదులుకున్నారు. కానీ ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ పార్టనర్ ఓటీటీ ఎంట్రీ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించింది. మరి ఈ సినిమా ఎప్పడు ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

చిదంబరం దర్శకత్వంలో వచ్చిన ముంజుమ్మేల్ బాయ్స్ సినిమా.. తెలుగులో ఏప్రిల్ 6న థియేటర్స్ లో రిలీజ్ అయింది. మలయాళంలో తక్కువ బడ్జెట్ తో అంటే సుమారు రూ.5 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా.. దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇటు తెలుగులో కూడా ఈ సినిమా అంచనాలకు మించి.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అఫీషియల్ గా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ ను ప్రకటించారు మేకర్స్. మంజుమ్మేల్ బాయ్స్ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 5 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Manjummel Boys OTT Release Date Fixed!

ఇక ఈ సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్ అన్న సంగతి తెలిసిందే. 2006 తమిళనాడు కొడైకెనాల్ లోని గుణ గుహల్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా.. ఈ సినిమాను తెరకెక్కించారు. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి గుణ గుహలను చూడడానికి వెళ్తారు. అందులో ఒకరు ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. దీనితో అతని ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసే ప్రయాణమే.. ఈ సినిమా కథ. తమ స్నేహితుడు కోసం మిగిలిన వారు ఎలాంటి రిస్క్ చేశారు. చివరకి ఎం జరిగింది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. థియేటర్ లో హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా.. ఓటీటీ లో ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి