iDreamPost
android-app
ios-app

OTTలోకి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడంటే?

  • Author Soma Sekhar Published - 09:22 PM, Thu - 9 November 23

ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది 'ఓపెన్ హైమర్' మూవీ. త్వరలోనే ఓటీటీ స్ట్రిమింగ్ కు సిద్దమవుతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది 'ఓపెన్ హైమర్' మూవీ. త్వరలోనే ఓటీటీ స్ట్రిమింగ్ కు సిద్దమవుతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 09:22 PM, Thu - 9 November 23
OTTలోకి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడంటే?

హాలీవుడ్ లో ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది ‘ఓపెన్ హైమర్’ మూవీ. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇక ఇండియాలో కూడా ఈ పిక్చర్ మంచి వసూళ్లనే రాబట్టింది. ఇదే సమయంలో భారతదేశంలో ఈ మూవీ విమర్శలను ఎదుర్కొంది. ఈ చిత్రంలో భగవద్గీతను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ.. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సూపర్ డూపర్ హిట్ చిత్రం త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దమవుతోంది. మరి ఓపెన్ హైమర్ కు సంబంధించిన ఓటీటీ విడుదల వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.

‘ఓపెన్ హైమర్’ హాలీవుడ్ మూవీ చరిత్రలో ఈ చిత్రం ఓ సంచలనం. అణుబాంబును తయ్యారు చేసిన సైంటిస్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఇక ఈ సంవత్సరం జులై 21న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువడమే కాకుండా.. హాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇండియాలో కూడా విడుదలైన ఓపెన్ హైమర్ మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే టైమ్ లో విమర్శలను కూడా ఎదుర్కొంది ఈ మూవీ. ఇందులో భగవద్గీతను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా.. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ 21 నుంచి ఓపెన్ హైమర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఇది తెలుగులో ఉంటుందా? ఉండదా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇదిలా ఉండగా.. గురువారం(నవంబర్ 9)న కొన్ని పైరసీ వెబ్ సైట్లలో ఓపెన్ హైమర్ హెచ్ డీ ప్రింట్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మేకర్స్ వెంటనే ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి థియేటర్లలో మిస్ అయిన ఈ సూపర్ హిట్ సినిమాను జాలీగా ఓటీటీలో చూసేయండి.