iDreamPost
android-app
ios-app

19 ఏళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన మూవీ OTTలోకి

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమాలన్నీ అద్భుత కళాఖండాలే. ఏ మూవీ బాగుంటుంది అంటే చెప్పడం కష్టం. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేయడంలో దిట్ట. అయితే ఆయన తెరకెక్కించిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి తొలిసారిగా రాబోతుంది.

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమాలన్నీ అద్భుత కళాఖండాలే. ఏ మూవీ బాగుంటుంది అంటే చెప్పడం కష్టం. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేయడంలో దిట్ట. అయితే ఆయన తెరకెక్కించిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి తొలిసారిగా రాబోతుంది.

19 ఏళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన మూవీ OTTలోకి

మణిరత్నం, సంజయ్ లీలా భన్సాలీ వీరిద్దరూ అటు కోలీవుడ్, ఇటు బాలీవుడ్‌కు దొరికిన అరుదైన ఆణిముత్యాలు. వీరి మధ్య చాలా విషయాలు మ్యాచ్ అవుతుంటాయి. ఈ ఇద్దరిలో హీరోయిన్లను చూపించే విధానం చాలా డిఫరెంట్. అలాగే ఎమోషనల్ టచ్ ఉంటుంది. ఇక భన్సాలీ మూవీస్‌లో హీరోయిన్లదే హవా. దేవదాస్ నుండి హీరా మండి వరకు అన్నీ మహిళకు ప్రాధాన్యమున్న సినిమాలను అందించాడు. ఆయన తెరకెక్కించిన మూవీస్‌లో ఏదీ ది బెస్ట్ అంటే చెప్పడం చాలా కష్టం. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ అద్భుతాలే. ప్రతి మూవీ ఓ శిల్పమే. అలా 19 ఏళ్ల క్రితం ఓ చక్కటి శిల్పాన్ని చెక్కాడు సంజయ్ లీలా భన్సాలీ. అదే బ్లాక్ మూవీ.

2005లో ఇదే రోజున అంటే ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలై మంచి హిట్ అందుకుంది. ప్రముఖ రచయిత్రి హెల్లెన్ కెల్లర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇందులో అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ నటించారు. రాణి ముఖర్జీ ఇందులో చెవిటి, కళ్లు లేని అమ్మాయిగా కనిపిస్తోంది. ఆమెకు విద్యా బుద్దులు నేర్పేందుకు అమితాబ్ టీచర్‌గా వస్తాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది.అయితే అల్జీమర్స్ వ్యాధి బారిన పడ్డ ఆయన.. రాణిని మర్చిపోతాడు. ఈ ఇద్దరి మధ్య నడిచే అందమైన, ఎమోషనల్ డ్రామానే బ్లాక్. అప్పట్లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమా మనస్సును హత్తకుంటుంది. ఏడిపిస్తుంది. మంచి వసూళ్లను రాబట్టుకోవడమే కాదూ..మూడు జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ మూవీ అంటే రిలీజైన ఇన్నాళ్లకు ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని తెలిపింది. ‘ సంజయ్ లీలా భన్సాలీ బ్లాక్ మూవీ విడుదలై 19 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు నెట్ ఫ్లిక్స్‌లో తొలిసారిగా విడుదల కానుంది. దేబ్రాజ్, మిచెల్ (అమితాబ్, రాణి ముఖర్జీ) ప్రయాణం మన అందరికీ స్పూర్తిదాయకం’ అంటూ పేర్కొంది. 19 ఏళ్ల క్రితం థియేటర్లలో విడుదలైన ఫిబ్రవరి 4నే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా డిజిటల్లోకి రావడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)