iDreamPost
android-app
ios-app

OTT suggestion: OTTలో వణికించే 4 హారర్ సినిమాలు! ఇక్కడ ఫ్రీగా చూసేయొచ్చు!

  • Published Feb 26, 2024 | 2:00 PM Updated Updated Feb 26, 2024 | 3:04 PM

ఈ మధ్య కాలంలో థియేటర్ లో సినిమాలు చూసే వారి సంఖ్యతో పాటు.. ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అయితే, ఓటీటీ సినిమాలంటే సబ్స్క్రిప్షన్ కంపల్సరీ. కానీ, ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా కూడా ఓటీటీలో బెస్ట్ హర్రర్ మూవీస్ ను చూసేయొచ్చు.

ఈ మధ్య కాలంలో థియేటర్ లో సినిమాలు చూసే వారి సంఖ్యతో పాటు.. ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అయితే, ఓటీటీ సినిమాలంటే సబ్స్క్రిప్షన్ కంపల్సరీ. కానీ, ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా కూడా ఓటీటీలో బెస్ట్ హర్రర్ మూవీస్ ను చూసేయొచ్చు.

  • Published Feb 26, 2024 | 2:00 PMUpdated Feb 26, 2024 | 3:04 PM
OTT suggestion: OTTలో వణికించే 4 హారర్ సినిమాలు! ఇక్కడ ఫ్రీగా చూసేయొచ్చు!

ప్రస్తుతం థియేటర్ లో విడుదల చేసే చిత్రాలైనా.. ఓటీటీ చిత్రాలైన అందరు ఎక్కువగా హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ నే ఇష్టపడుతూ ఉన్నారు. ఇక ఆడియన్సు పల్స్ ని క్యాచ్ చేసిన మూవీ మేకర్స్.. హర్రర్ చిత్రాలను మరింత ఎక్సయిటింగ్ గా చిత్రీకరిస్తున్నారు. దీనితో ఆడియన్సులో హర్రర్ చిత్రాలపై రోజు రోజుకి క్యూరియాసిటీ పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అనేక రకాల హర్రర్ మూవీస్ ను విడుదల చేస్తున్నారు. ఇక ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కైనా సబ్స్క్రిప్షన్ కంపల్సరీ. కానీ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేనివారి కూడా ఇప్పుడు గుండెకు దడ పుట్టించే.. బెస్ట్ హర్రర్ మూవీస్ ని ఫ్రీ గా చూసేయొచ్చు. అది ఎక్కడంటే యూట్యూబ్‌లో. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా జోనర్ తో సంబంధం లేకుండా అనేక రకాల మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ మూవీస్ ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే.. వాటిని వెంటనే చూసేయాల్సిందే.

క్షణక్షణం ఉత్కంఠ భరింతగా సాగే సన్నివేశాలు, ప్రేక్షకుల గుండెలకు దడ పుట్టించే సీన్స్, ఆడియన్సు వెన్నులో వణుకు పుట్టించే విచిత్రమైన కథాంశాలు ఇలా అన్ని కలగలిపిన నాలుగు బెస్ట్ హర్రర్ చిత్రాల జాబితా ఇలా ఉంది.

1)డిమోంటీ కాలనీ:
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక నలుగురు స్నేహితులు.. సరదాగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ క్రమంలో అనుకోకుండా ఓ పాత భవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఓ నెక్లెస్ దొరుకుతుంది. ఆ నెక్లెస్ దొరికిన తర్వాత వారి జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి! అసలు వారి మధ్య ఏం జరిగింది! వారు ఎలాంటి సంఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చింది! వారు ఆ భవనం నుంచి భయటపడతారా లేదా ! అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. క్షణ క్షణం ఊహించిన ట్విస్ట్స్ తో.. బెస్ట్ హార్రర్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా సాగిపోతూ ఉంటుంది. ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీ గా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ సినిమా సిక్వెల్ గా డిమోంటీ కాలనీ-2 కూడా రాబోతుంది.

2)ఎల్ 7 [L7]:
ఇక ఈ హర్రర్ సినిమా విషయానికొస్తే.. ఎల్7 హిందీ డబ్బడ్ వెర్షన్ మూవీ, ఈ మూవీకి 40 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కాబట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఒక రొమాంటిక్ హర్రర్ సినిమా. కొత్తగా ఓ ఇంట్లోకి రెంట్ కి దిగిన జంటకు.. దెయ్యం రూపంలో ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి.! ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నపుడు మాత్రమే ఆ దెయ్యం ఆమెను ఎందుకు భయపెడుతూ ఉంటుంది! అసలు దాని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయి! అనేదే ఈ సినిమా కథ. ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా ఈ సినిమాను మిస్ అయ్యి ఉంటె మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే.

3) కాలింగ్ బెల్ :
ఈ చిత్రం కూడా ఓ రొమాంటిక్ హర్రర్ తో స్టార్ట్ అయ్యి.. కొన్ని థ్రిల్లింగ్, హర్రర్ సీన్స్ తో సాగుతుంది. ఈ సినిమా కథ ఏంటంటే .. కొత్తగా పెళ్ళైన ఓ జంట ఓ ఇంట్లోకి దిగుతారు. ఆల్రెడీ ఆ ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఆ విషయం వారికీ తెలీకుండానే ఆ ఇంట్లో హ్యాపీగా గడిపేస్తారు. ఆ తర్వాత ఆ జంట ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వెంటనే ఆ ఇంట్లోకి ఇంకొంతమంది ఫ్రెండ్స్ వస్తారు. అప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి!.. అనేదే ఈ సినిమా కథ. థియేటర్ లో విడుదల అయినపుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. పైగా ఈ సినిమాకు సిక్వెల్ కూడా ఉంది.

4)రాక్షసి:
కాలింగ్ బెల్ సినిమాకు సిక్వెల్ గా వచ్చిన మూవీనే రాక్షసి . ఈ సినిమాలో ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని నటి పూర్ణ .. హీరోయిన్ గా నటించారు. ఒక ఇంట్లోకి ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన పూర్ణ .. గతంలో తనకు ఎదురైనా సంఘటనల గురించి ఓ స్వామిజికి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ స్వామిజి చెప్పిన నిజాలు విని ఆమె ఆశ్చర్యపోతుంది. అసలు ఆ స్వామిజి పూర్ణకు ఎం చెప్పారు ! అదే ఇంట్లో ఉండే దెయ్యానికి వాళ్ళు బలవుతారా! కాలింగ్ బెల్ సినిమాను ఈ సినిమాకు ఎలా లింక్ చేశారు ! అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇలా ప్రేక్షకులకు క్షణ క్షణం ఉత్కంఠభరితంగా ఫీల్ అయ్యేలా సన్నివేశాలు ఈ చిత్రాలలో ఉన్నాయి. అసలు దెయ్యాలు మనుషులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తాయి. వాటినుంచి వారు ఎలా తప్పించుకుంటున్నారు. అసలు అది నిజామా కాదా ఇలా అన్నిటిని కళ్ళకు కట్టినట్లు ఈ హర్రర్ సినిమాలలో చూపించారు. మరి, ఇప్పటివరకు ఈ సినిమాలను కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే.. ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా యూట్యూబ్ లో వీటిని చూసేయొచ్చు. మరి, ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.