iDreamPost
android-app
ios-app

నరాలు తెగే ఉత్కంఠ.. ఈ సిరీస్ అస్సలు మిస్ కావొద్దు!

Suspense Thriller Web Series: వెబ్ సిరీస్ ప్రియుల కోసం ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చేశాం. ఈ వీకెండ్ కి ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి చూసేయండి.

Suspense Thriller Web Series: వెబ్ సిరీస్ ప్రియుల కోసం ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో వచ్చేశాం. ఈ వీకెండ్ కి ఈ వెబ్ సిరీస్ ని ఒకసారి చూసేయండి.

నరాలు తెగే ఉత్కంఠ.. ఈ సిరీస్ అస్సలు మిస్ కావొద్దు!

వెబ్ సిరీస్ లు చూడటం అనేది ఒక వీక్ నెస్. దానికి ఎవరూ అతీతులు కాదు. సినిమా కంటే కూడా వెబ్ సిరీస్ అనేది ఒక ఎమోషన్. దానికి అలవాటు పడితే బయటకు రావడం చాలాకష్టం. ఒక మంచి వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేస్తే.. అది అయిపోయే వరకు నిద్ర పట్టదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వెబ్ సిరీస్ లో ఓటీటీలో చాలానే ఉన్నాయి. కానీ, ఆడియన్స్ ఏ సిరీస్ చూడాలో క్లారిటీ లేక చాలా మంచి మంచి సిరీస్లను పట్టించుకోవడం లేదు. వెబ్ సిరీస్ లవర్స్ కోసం ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేశాక.. దీనిని ఆపడం చాలా కష్టం అనే చెప్పాలి.

అది మరేదో కాదు.. సుడల్: ది వోర్టెక్స్ వెబ్ సిరీస్. ఇది ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగే సిరీస్. నిజానికి మన ఊరిలోనే, మన ఇంటి పక్కనో, మన చుట్టూనో జరిగే కథలాగానే అనిపిస్తుంది. కథలోకి వెళ్లే కొద్దీ ఇలాంటి ఘటన మనకే ఎదురైతే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న ఎదురవుతుంది. ఒక్కో సీన్ నరాలు తెగే ఉత్కంఠను అందిస్తుంది. కాస్త స్లోగా సాగుతున్న డ్రామాగా అనిపించినా కూడా ప్రతి ఎపిసోడ్ కి ఆ సస్పెన్స్ ని అయితే ఫీలవగలగుతారు. పైగా పార్దిబన్, ఐశ్వర్యా రాజేశ్, శ్రియారెడ్డి, కథిర్ యాక్టింగ్, పాత్రల్లో వారు ఒదిగిన తీరు, ఆ సీన్ ఇన్ టెన్సిటీని ఏ మాత్రం తగ్గించకుండా వారు చేసిన నటన తప్పక మెప్పిస్తాయి.

నిజానికి ఈ వెబ్ సిరీస్ తమిళంలో తీసినప్పటికీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ 2022 జూన్ 17న అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది. కానీ, ఇప్పటికీ చాలామంది ఈ సిరీస్ ని చూడలేదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గురించి తెలుసు. ఈ సిరీస్ నిడివి కూడా కాస్త ఎక్కువగానే ఉటుంది. మొత్తం 8 ఎపిసోడ్లు.. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల కంటే ఎక్కువగానే ఉంటాయి. నిడివి ఎక్కువున్న నేపథ్యంలో కాస్త సాగదీత భావన కలుగుతుంది. కానీ, నటీనటుల టాలెంట్ మాత్రం మెప్పిస్తుది. కొన్ని సీన్స్ మీరు అలా చూస్తూ ఉండిపోతారు. ముఖ్యంగా ఐశ్వర్య రాజేశ్ ఎమోషన్స్ ని పలికించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రియా రెడ్డి చేతులు కట్టేసిన పోలీసు అధికారిగా ఆకట్టుకుంటుంది.

కథ ఏంటంటే?:

సాంబాలురులోని సింమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు, యాజమాన్యానికి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ ఫ్యాక్టరీ ఎండీ త్రిలోక్(హరీష్ ఉత్తమన్) వద్ద సీఐ రెజీనా(శ్రియా రెడ్డి) కొంత నగదు తీసుకుంటుంది. అందుకు ప్రతిఫలంగా త్రిలోక్ కార్మికుల నాయకుడు షణ్ముగం(పార్దిబన్)ను ఏదో కేసులో ఇరికించాలంటూ ఫోర్స్ చేస్తాడు. సమ్మె జరిగిన రాత్రే ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగి మొత్తం కాలి బూడిద అవుతుంది. షణ్ముగంపై అనుమానంతో అతడిని అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లగా.. అతని 15 ఏళ్ల చిన్న కుమార్తె కనిపంచడం లేదనే వార్త తెలుస్తుంది. ఆ తర్వాత మిస్సింగ్ కేసు.. మర్డర్ గా మారుతుంది. అప్పుడే ఊరిలో అంకాళమ్మ జాతర జరుగుతూ ఉంటుంది. షణ్ముగం కుమార్తెతో పాటు.. సీఐ రెజీనా కుమారుడి బాడీ కూడా చెరువులో దొరుకుతుంది. ఇవి హత్యలా? ఆత్మ హత్యలా? అనే అనుమానాలు వస్తాయి.

15 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీ ప్రారంభం సమయంలో ఒక అమ్మాయి తప్పిపోవడం.. ఇప్పుడు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అమ్మాయి చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతాయి. కేసు విచారణలో ఎస్ఐ చక్రి(కథిర్), షణ్ముగం పెద్ద కుమార్తె(ఐశ్వర్య రాజేశ్) కొన్ని నిజాలు తెలుసుకుంటారు. అలాగే ఈ హత్యలు నరబలి ఏమో అనే అనుమానాలు కూడా వస్తాయి. మరోవైపు త్రిలోక్ వైపు కూడా కొన్నివేళ్లు తిరుగుతాయి. ఈ నేపథ్యంలో కథ మొత్తం కాస్త ఎమోషనల్ గా, సస్పెన్స్ గా మారుతుంది. ప్రతి ఎపిసోడ్ కి ఒక ట్విస్టని రివీల్ చేస్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్తారు. మరి.. సుడల్ వెబ్ సిరీస్ మీరు చూడాలి అనుకుంటున్నారా? ఒకవేళ ఇప్పటికే చూస్తే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.