iDreamPost
android-app
ios-app

అన్‌స్టాపబుల్ సీజన్ 3: 23 నుంచి షూటింగ్… నాగార్జున తో తొలి ఎపిసోడ్

  • Published Aug 20, 2024 | 2:00 PM Updated Updated Aug 20, 2024 | 2:11 PM

Telugu Talk Show Unstoppable Season 3 Update: 2021 లో ఆహా లో స్టార్ అయిన.. అన్‌స్టాపబుల్ షో ఇప్పటికి తిరుగులేని ఎవర్ గ్రీన్ షో గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పుడు మూడవ సీజన్ కు రెడీ అయిపోతుంది. తాజాగా ఈ సీజన్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది.

Telugu Talk Show Unstoppable Season 3 Update: 2021 లో ఆహా లో స్టార్ అయిన.. అన్‌స్టాపబుల్ షో ఇప్పటికి తిరుగులేని ఎవర్ గ్రీన్ షో గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పుడు మూడవ సీజన్ కు రెడీ అయిపోతుంది. తాజాగా ఈ సీజన్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది.

  • Published Aug 20, 2024 | 2:00 PMUpdated Aug 20, 2024 | 2:11 PM
అన్‌స్టాపబుల్ సీజన్ 3: 23 నుంచి షూటింగ్… నాగార్జున తో తొలి ఎపిసోడ్

ఓటీటీ లో వచ్చే సినిమాలు , సిరీస్ ల తో పాటు.. ఇప్పుడు టాక్ షో లు , సింగింగ్ షో లకు కూడా విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. ఆల్రెడీ ప్రస్తుతం సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడిల్ రెండు సీజన్స్ ను పూర్తి చేసుకుని.. ఇప్పుడు మూడవ సీజన్ విజయవంతంగా రన్ అవుతుంది. అలాగే సుధీర్ సర్కార్ షో కూడా నాల్గవ సీజన్ రన్ అవుతుంది. వీటితో పాటు ఓటీటీ లో బాగా ఫేమస్ అయినా మరొక తెలుగు టాక్ షో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ . ఈ షో కూడా ఇప్పటికే రెండు సీజన్స్ ను విజవంతంగా పూర్తి చేసుకుని.. మూడవ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది, ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు బుల్లి తెర టీవీ షో లతో పాటు.. ఇప్పుడు ఓటీటీ లో వచ్చే టాక్ షో లకు కూడా విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. ఈ టాక్ షో ల లిస్ట్ లో ముందుండేది మాత్రం.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో నే. నార్మల్ గానే బాలకృష్ణ వెండితెరపై కనిపిస్తున్నారంటే.. అభిమానులు అనడంతో ఊగిపోతుంటారు. ఈ క్రమంలో 2021 లో ఆహా లో స్టార్ అయిన ఈ షో కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ లభించింది. అప్పటివరకు ఏ షోస్ కు రాని ఎంతో మంది స్టార్స్ అంతా..ఈ షో లో అలరించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. ఇక ఇప్పటికి రెండు సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ షో… ఇప్పుడు మూడవ సీజన్ కు రెడీ అయిపోతుంది. ఈ సీజన్ షూటింగ్ ను ఆగస్ట్ 23 నుంచి స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక మూడవ సీజన్ కు మొదటి గెస్ట్ గా అక్కినేని నాగార్జున రాబోతున్నారట. మరి వీరిద్దరూ కాంబో లో వచ్చే అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, బోయపాటి, థమన్, శ్రీకాంత్, ప్రగ్యా, రాజమౌళి, కీరవాణి, బన్నీ, రష్మిక, సుకుమార్, రవితేజ, విజయ్ దేవరకొండ, రానా, పూరి, చార్మి, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో.. సక్సెస్ ఫుల్ గా 10 ఎపిసోడ్స్ గా కొనసాగింది. ఇక సెకండ్ సీజన్ లో మూవీ స్టార్స్ తో పాటు.. పొలిటీషియన్స్ ను కూడా టాక్ షో లో పార్టిసిపేట్ చేసేలా చేశారు బాలకృష్ణ. ఇక రెండవ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా 10 ఎపిసోడ్స్ తో పూర్తయింది. మరి మూడవ సీజన్ లో ఎలాంటి గెస్ట్స్ వస్తారో.. ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో వేచి చూడాలి. మరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 3 అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş