Swetha
ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే.. హర్రర్ మూవీస్ అంటే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అనన్య నాగళ్ళ నటించిన హర్రర్ మూవీ తంత్ర ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ చూసేద్దాం.
ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే.. హర్రర్ మూవీస్ అంటే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అనన్య నాగళ్ళ నటించిన హర్రర్ మూవీ తంత్ర ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ చూసేద్దాం.
Swetha
ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఓటీటీ సినిమాలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అందుకే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా.. జోనర్ , లాంగ్వేజ్ బారియర్ లేకుండా అన్ని సినిమాల ఓటీటీ రిలీజ్ లకు, స్ట్రీమింగ్ లకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఆ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన దగ్గర నుంచి తిరిగి ఓటీటీ లో అడుగుపెట్టేంత వరకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఆయా సినిమాల గురించి కనీసం రెండు నుంచి మూడు సార్లు చర్చలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా అనన్య నాగళ్ళ నటించిన హర్రర్ సినిమా మార్చి 15న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఓవరాల్ గా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి తంత్ర సినిమా ఓటీటీ టాక్ గురించి చూసేద్దాం.
అనన్య నాగళ్ళకు వకీల్ సినిమాతో మంచి పేరు వచ్చిన తర్వాత.. లీడ్ రోల్ లో కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలో తాజాగా అనన్య నటించిన హర్రర్ ఫిల్మ్.. “తంత్ర”. ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. కాగా.. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవి చైతన్య ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించగా.. అనన్య నాగళ్ళతో పాటు.. హీరోయిన్ సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్షణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా మొత్తం కూడా పూర్తిగా హర్రర్ జోనర్ లోనే తెరకెక్కించారు. అయితే థియేటర్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించినా కూడా.. ఎక్కువ కాలం మాత్రం నిలవలేకపోయింది. కథ పరంగా ఈ సినిమా ఆకట్టుకున్నా కూడా.. కలెక్షన్ల పరంగా మాత్రం దెబ్బ తిందని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5నుంచి తంత్ర సినిమా ఆహ లో స్ట్రీమింగ్ అవుతోంది. హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికీ ఇదొక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఈ సినిమాను ఆహలో చూసేయొచ్చు.
ఇక తంత్ర సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవ్వరు కనీ విని ఎరుగని క్షుద్ర పూజల గురించి.. ప్రస్తావించినట్లు సమాచారం. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ రేఖ పాత్ర పోషించగా.. ఆమె తల్లి పాత్రలో సలోని నటించింది. అనన్య నాగళ్ళ పుట్టుకతోనే తన తల్లిని కోల్పోతుంది, ఆమె తన నానమ్మ పెపంకంలో పెరుగుతుంది, ఈ క్రమంలో ఆమె ధనుష్ రఘుముద్రిను ఇష్టపడుతుంది. అయితే అతను వేశ్య కొడుకు కావడంతో వారి ప్రేమకు అడ్డంకులు ఎదురౌతాయి. మరో వైపు క్షుద్ర శక్తుల కారణంగా జన్మించడంతో. అనన్య వైపు ఎప్పుడు దయ్యాలు తిరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమికి ఆమెను వెతుక్కుంటూ.. ఒక రక్త పిశాచి వస్తుంటుంది. అసలు దాని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయి! వారి ప్రేమ సఫలం అవుతుందా లేదా ! అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూసేయాల్సిందే. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.