iDreamPost
android-app
ios-app

OTTలోకి త్రిష నటించిన థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Author Soma Sekhar Published - 07:31 PM, Wed - 8 November 23

దీపావళి కానుకగా సీనియర్ హీరోయిన్ త్రిష నటించిన థ్రిల్లర్ మూవీ 'ది రోడ్' తెలుగులో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టే ఈ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.

దీపావళి కానుకగా సీనియర్ హీరోయిన్ త్రిష నటించిన థ్రిల్లర్ మూవీ 'ది రోడ్' తెలుగులో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టే ఈ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 07:31 PM, Wed - 8 November 23
OTTలోకి త్రిష నటించిన థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర చిత్రాలకు లేదనే చెప్పాలి. సీట్ ఎడ్జ్ న కూర్చో బెట్టే థ్రిల్లర్ మూవీలను భారీ హక్కులకు దక్కించుకుంటున్నాయి ప్రముఖ ఓటీటీ సంస్థలు. ఇక ఈ సస్పెన్స్ సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తాయా? ఎప్పుడు వాటిని చూద్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటి వారికోసం ఓ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉంది. సీనియర్ హీరోయిన్ త్రిష లీడ్ రోల్ లో నటించిన థ్రిల్లర్ మూవీ ‘ది రోడ్’. తమిళనాడులో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని దీపావళికి ప్రముఖ తెలుగు ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

త్రిష కృష్ణన్.. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తు.. యంగ్ హీరోయిన్ లకు దడపుట్టిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ 1,2 చిత్రాలతో పాటుగా తాజాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన దళపతి లియో లో నటించి.. వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం అరడజన్ కు పైగా తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ.. ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక దసరా కనుకగా త్రిష నటించిన థ్రిల్లర్ మూవీ’ది రోడ్’ తమిళనాటలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకురానున్నారు.

ఈ దీపావళికి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాలో తెలుగులో ‘ది రోడ్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు వశీకరన్ దర్శకత్వం వహించాడు. నిజ జీవిత కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్. నవంబర్ 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. ఒకే ప్రాంతంలో పదేపదే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ యాక్సిడెంట్స్ వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టే విధంగా డైరెక్టర్ తీర్చిదిద్దాడు. మరి తెలుగు ప్రేక్షకులను ది రోడ్ ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుందో వేచి చూడాలి.