iDreamPost
android-app
ios-app

OTT News: OTTలోకి వ‌చ్చేస్తోన్న పూర్ణ హార‌ర్ మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

  • Published Feb 28, 2024 | 1:31 PM Updated Updated Mar 14, 2024 | 4:07 PM

ఇప్పుడు వరుసగా ఓటీటీలలో సినిమాలు విడుదలవుతున్న క్రమంలో.. తాజాగా మరో తమిళ మూవీ ఓటీటీ లో సందడి చేయనుంది. అదే పూర్ణ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ డెవిల్. ఈ మూవీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడు వరుసగా ఓటీటీలలో సినిమాలు విడుదలవుతున్న క్రమంలో.. తాజాగా మరో తమిళ మూవీ ఓటీటీ లో సందడి చేయనుంది. అదే పూర్ణ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ డెవిల్. ఈ మూవీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 28, 2024 | 1:31 PMUpdated Mar 14, 2024 | 4:07 PM
OTT News: OTTలోకి వ‌చ్చేస్తోన్న పూర్ణ హార‌ర్ మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

ఈ మధ్య కాలంలో ఓటీటీ సినిమాలకు పెరుగుతున్న ఆదరణ అంత ఇంత కాదు. జోనర్ తో సంబంధం లేకుండా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ప్రతి సినిమాను కథను బట్టి ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అలానే, థియేటర్ లో ఆయా సినిమాలు ఎటువంటి టాక్ ను సంపాదించుకున్న సరే.. వాటితో సంబంధం లేకుండా ఓటీటీలో మాత్రం విడుదల చేస్తున్నారు. వాటిలో డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల అయ్యే సినిమాలు కొన్ని, థియేటర్ లో విడుదల అయిన తర్వాత ఓటీటీ ఎంట్రీ ఇచ్చేవి మరికొన్ని. ఈ క్రమంలో ఓ విధంగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని సినిమాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి పూర్ణ హీరోయిన్ గా నటించిన .. తమిళ మూవీ డెవిల్ కూడా యాడ్ అవ్వనుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.

మూవీ నేమ్ ని బట్టి చూసి చెప్పేయొచ్చు ఇదొక హర్రర్ మూవీ అని. ఇక హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి.. డైరెక్టర్ ఆథియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటి పూర్ణ లీడ్ రోల్ లో నటించింది. అటు పూర్ణ తో పాటు.. టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీల‌క పాత్ర పోషించాడు. కాగా, విదార్థ్ హీరోగా న‌టించాడు. అయితే, ఫిబ్రవరి 2న ఈ సినిమా థియేటర్ లో విడుదలైంది. కానీ, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక పూర్ణ‌, త్రిగుణ్ ఇద్ద‌రు తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం ఉండడంతో.. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, “డెవిల్” సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 1నుంచి ప్రసారం కాబోతుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. డెవిల్ మూవీ ఒక హౌస్ వైఫ్ కథ. ఈ సినిమాలో ఓ హౌస్ వైఫ్ గా పూర్ణ కనిపిస్తుంది. ఇక ఈమె హస్బెండ్ ఓ ఫేమస్ లాయర్. అతను ఇంట్లో భార్యను ఉండగానే .. ఆఫీస్ లో మరో అమ్మయితో రిలేషన్ షిప్ కొనసాగిస్తాడు. మరో వైపు ఓ యాక్సిడెంట్ ద్వారా రోషన్ అనే వ్యక్తి పూర్ణ లైఫ్ లోకి వస్తాడు. ఆ తర్వాత ఎం జరిగింది? పూర్ణ , రోషన్ ల మధ్య ఎటువంటి బంధం కొనసాగింది? చివరికి ఈ స్టోరీ ఎలా ముగిసింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఓటీటీ లో విడుదల అయిన తర్వాత ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి . మరి, పూర్ణ లీడ్ రోల్ లో నటించిన “డెవిల్” సినిమా ఓటీటీ అప్ డేట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetholiganbetKingroyal girişJojobet GirişcasibomHoliganbetgalabetHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbetjojobetjojobetcasibomcasibom