iDreamPost
android-app
ios-app

OTTలోకి ఆడుజీవితం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్. ఆడు జీవితం.. ది గోట్ లైఫ్ చిత్రంతో ఇటీవల మన ముందుకు వచ్చాడు. వచ్చిన 9 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది . ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమౌతుంది.

సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్. ఆడు జీవితం.. ది గోట్ లైఫ్ చిత్రంతో ఇటీవల మన ముందుకు వచ్చాడు. వచ్చిన 9 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది . ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమౌతుంది.

OTTలోకి ఆడుజీవితం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మలయాళ ఇండస్ట్రీకి చెందిన సినిమాలు బాక్సాఫీసు వద్ద హవా కొనసాగిస్తున్నాయి. ఈ మూడు నెలల కాలంలో నాలుగు సినిమాలు వంద కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. మమ్ముట్టి బ్రహ్మ యుగం, ప్రేమలు, సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్, ఇప్పుడు సలార్ ఫేం, మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడు జీవితం, ది గోట్ లైఫ్ కూడా వంద కోట్ల మార్కును చేరుకుంది. శుక్రవారంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. మాలీవుడ్‌లో అత్యంత ఫాస్టెస్ట్ వంద కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కోసం సుకుమార్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినట్లయ్యింది. ఒక్క సినిమా కోసం ఐదేళ్లు కష్టపడటం చూశాం, పదేళ్లు కష్టపడం చూశాం కానీ.. ఏకంగా 16 ఏళ్ల పాటు ఈ మూవీని తన భుజాలపై మోశాడు పృధ్వీ.

2009లో ప్రకటించిన సినిమా 2024 మార్చి 28న థియేటర్లలో రిలీజైంది.. సుమారు 82 కోట్లతో నిర్మించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. బెన్యామిస్ రాసిన గోట్ డేస్ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో కొన్ని సన్నివేశాల కోసం భారీగా బరువు తగ్గాడు మలయాళ హీరో. 31 కిలోల వరకు బరువు తగ్గాడు. 72 గంటల పాటు భోజనం లేకుండా కేవలం మంచి నీళ్లు మాత్రమే తాగారు. పృధ్వీతో పాటు హాలీవుడ్ నటులు జిమ్మి జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబేలు కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది.

The goat life

అయితే టిల్లు స్క్వేర్ ప్రభావం కారణంగా తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ కలెక్షన్ల పరంగా తగ్గదేలే అని నిరూపించుకుంది. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమౌతుంది. దీని స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లు టాక్. కాగా, గోట్ లైఫ్ మే 10న రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంటే నెల రోజుల తర్వాతే ఓటీటీలో సందడి చేయనుంది. ఇక నుండి ఏ మలయాళ సినిమా అయినా కూడా థియేటర్లలో రిలీజైన నాటి నుండి 40 రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. ఈ మేరకు కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యూనియన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ లెక్క ప్రకారం 40 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ కానుంది గోట్ లైఫ్ మూవీ కూడా.