iDreamPost
మరోసారి అలాంటి ప్రయత్నం చేసే దశలో మరో కథ రాసుకున్నారు కానీ దాన్ని చేయలేకపోయారు. యమగోల టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆయన వారసుడు సిఎస్ రావు తర్వాత డిఎస్ రాజు దగ్గరకు ఆ కథ ప్రయాణం చేసింది. కానీ షూట్ కు వెళ్ళలేదు. తర్వాత దీన్ని రామానాయుడు గారు కొన్నారు కానీ ఎందుకో ఇది ఆడుతుందన్న నమ్మకం లేక మౌనం వహించారు. అలా కొన్నేళ్లు గడిచాయి.
మరోసారి అలాంటి ప్రయత్నం చేసే దశలో మరో కథ రాసుకున్నారు కానీ దాన్ని చేయలేకపోయారు. యమగోల టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆయన వారసుడు సిఎస్ రావు తర్వాత డిఎస్ రాజు దగ్గరకు ఆ కథ ప్రయాణం చేసింది. కానీ షూట్ కు వెళ్ళలేదు. తర్వాత దీన్ని రామానాయుడు గారు కొన్నారు కానీ ఎందుకో ఇది ఆడుతుందన్న నమ్మకం లేక మౌనం వహించారు. అలా కొన్నేళ్లు గడిచాయి.
iDreamPost
తెలుగు సినిమా చరిత్రలో యముడిని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని వచ్చి అశేష బాలగోపాలాన్ని అలరించిన సినిమాల్లో అగ్ర తాంబూలం ఇవ్వాల్సి వస్తే మొదటి స్థానం అందుకునే చిత్రం యమగోల. ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళొద్దాం. 1960లో సి పుల్లయ్య ‘దేవాంతకుడు’ సినిమా రూపంలో మానవులు భయపడే యముడితో అల్లరి చేయించి గొప్ప విజయం అందుకున్నారు. మరోసారి అలాంటి ప్రయత్నం చేసే దశలో మరో కథ రాసుకున్నారు కానీ దాన్ని చేయలేకపోయారు. యమగోల టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆయన వారసుడు సిఎస్ రావు తర్వాత డిఎస్ రాజు దగ్గరకు ఆ కథ ప్రయాణం చేసింది. కానీ షూట్ కు వెళ్ళలేదు. తర్వాత దీన్ని రామానాయుడు గారు కొన్నారు కానీ ఎందుకో ఇది ఆడుతుందన్న నమ్మకం లేక మౌనం వహించారు. అలా కొన్నేళ్లు గడిచాయి.
అదే సమయంలో కెమెరామెన్ వెంకటరత్నం నిర్మాతగా సక్సెస్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. మొదటి సినిమా ‘ఈతరం మనిషి’ ఫ్లాప్ అయ్యింది. ఈసారి యమగోల టైటిల్ మీద గురి కుదరటంతో నాయుడు దగ్గర హక్కులు కొనేసి డివి నరసరాజుతో ఒరిజినల్ వెర్షన్ తో సంబంధం లేకుండా కొత్త మార్పులతో వేరే స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. తాతినేని రామారావుని దర్శకుడిగా తీసుకున్నారు. ముందు హీరోగా బాలకృష్ణను అనుకున్నారు కానీ ఎన్టీఆర్ ఇంత బరువైన కథకు అబ్బాయి తూగలేడని చెప్పి తనే హీరోగా నటించేందుకు రెడీ అయ్యారు. 1977 మేలో షూటింగ్ మొదలైతే కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేయడం అప్పట్లో ఒక రికార్డు. అడవి రాముడు సిల్వర్ జూబ్లీ కోసం రెండు నెలలు ఆగి మరీ యమగోలను అవే థియేటర్లలో విడుదల చేయడం గొప్ప సంచలనం.
అలా 1977 అక్టోబర్ 21న రిలీజైన యమగోల చరిత్ర సృష్టించింది. లవకుశ, దానవీరశూరకర్ణ, అడవిరాముడు తర్వాత కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాగా కొత్త రికార్డులు అందుకుంది. 28 సెంటర్లలో వంద రోజులు, 6 కేంద్రాల్లో 175 రోజులు ఆడటం విశేషం. చక్రవర్తి పాటలు తెలుగు రాష్ట్రాన్ని ఊపేశాయి. ఓలమ్మి తిక్కరేగిందా, చిలకకొట్టుడు కొడితే చిన్నదానా పాటలకు తెరమీదకు డబ్బులు విసిరేవారు. గుడివాడ యెల్లాను ఐటెం సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ మర్చిపోయేది కాదు. మిగిలిన సాంగ్స్ కూడా అంతే. ఇంద్రుడిని క్లాసు పీకుతూ లాజిక్కులతో ఎన్టీఆర్ చెప్పే డైలాగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడైతే వివాదాలు వచ్చేవి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిందీ(లోక్ పరలోక్), తమిళం(యమునక్కు యమన్)లో రీమేక్ చేస్తే అక్కడ ఫ్లాప్ కావడం అసలు ట్విస్ట్
Also Read : Eenadu : సోషల్ మెసేజ్ తో సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ – Nostalgia