iDreamPost
android-app
ios-app

Jodi : యాక్షన్ దర్శకుడు ప్రేమకథ చేస్తే

  • Published Mar 22, 2022 | 8:30 PM Updated Updated Dec 23, 2023 | 6:43 PM

అదో పెద్ద సవాల్. అందులోనూ మొదటి సినిమానే ఫ్లాప్ అయితే ఇక ఆ ఇబ్బందిని అధిగమించడమంటే మాటలు కాదు. ఓ ఉదాహరణ చూద్దాం. 1997. ప్రముఖ నిర్మాత కెటి కుంజుమోన్ నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రక్షకుడు తీశారు

అదో పెద్ద సవాల్. అందులోనూ మొదటి సినిమానే ఫ్లాప్ అయితే ఇక ఆ ఇబ్బందిని అధిగమించడమంటే మాటలు కాదు. ఓ ఉదాహరణ చూద్దాం. 1997. ప్రముఖ నిర్మాత కెటి కుంజుమోన్ నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రక్షకుడు తీశారు

Jodi : యాక్షన్ దర్శకుడు ప్రేమకథ చేస్తే

సాధారణంగా ఒక యాక్షన్ మూవీతో డెబ్యూ చేసిన డైరెక్టర్ వెంటనే దానికి విరుద్ధమైన జానర్ కు వెళ్లడం అంత సులభం కాదు. అదో పెద్ద సవాల్. అందులోనూ మొదటి సినిమానే ఫ్లాప్ అయితే ఇక ఆ ఇబ్బందిని అధిగమించడమంటే మాటలు కాదు. ఓ ఉదాహరణ చూద్దాం. 1997. ప్రముఖ నిర్మాత కెటి కుంజుమోన్ నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రక్షకుడు తీశారు. అప్పట్లోనే కోట్లాది రూపాయల బడ్జెట్ తో ప్రస్తుత ప్యాన్ ఇండియా ప్రాజెక్టులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు పెట్టడం చూసి నేషనల్ మీడియా సైతం ఆశ్చర్యపోయింది. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన పాటలు మారుమ్రోగిపోయాయి.

కట్ చేస్తే రక్షకుడు డిజాస్టర్ అయ్యింది. కుంజుమోన్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగారు. ప్రవీణ్ గాంధీ భవిషత్తు రిస్క్ లో పడింది. స్టార్స్ ని హ్యాండిల్ చేయలేక తడబడిన తీరు ఆఫర్లు వెంటనే రానివ్వలేదు. ఫలితంగా గ్యాప్ వచ్చేసింది. అనవసరమైన అతి తెలివితో పొరపాట్లు చేయడం కన్నా సేఫ్ ఆడటం బెటరని గుర్తించి రాసుకున్న కథే జోడి. ఇది 1999లో కార్యరూపం దాల్చింది. జీన్స్ తో తెలుగు తమిళం రెండు చోట్లా మంచి మార్కెట్ సంపాదించుకున్న ప్రశాంత్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా తెరకెక్కించారు. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ సూపర్బ్ అనిపించే మెలోడియస్ ఆల్బమ్ ఇచ్చారు. ఆడియో క్యాసెట్స్ లోనే చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

నిజానికి ఇందులో పాటలు అప్పటికి వచ్చేసినవే. హిందీలో అక్షయ్ ఖన్నా హీరోగా వచ్చిన డోలి సజాకె రఖ్న(1997) ట్యూన్సే వాడుకున్నారు. రెహమాన్ బిజీ షెడ్యూల్ వల్ల ఫ్రెష్ గా కంపోజ్ చేయలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాబేష్ మురళి ఇచ్చారు. మ్యూజిక్ షాప్ లో పని చేసే కుర్రాడు తన కలల రాణిని చూస్తాడు. రెండు పరస్పర విరుద్ధ భావాలు కలిగిన కుటుంబాలను ఒప్పించి వీళ్ళ ప్రేమ ఎలా పెళ్లి దాకా వెళ్లిందనేది కథ. రమేష్ అరవింద్ స్పెషల్ క్యామియో చేశారు. 1999 సెప్టెంబర్ 9 తమిళంలో, అదే సంవత్సరం నవంబర్ 11న తెలుగులో జోడి రిలీజయ్యింది. కేవలం రెండు రోజుల ముందు వచ్చిన ఒకే ఒక్కడు తాకిడిని తట్టుకుని హిట్ అయింది.

Also Read : Aradhana : ఇమేజే ప్రతిబంధకంగా మారిన ఆరాధన – Nostalgia