iDreamPost
android-app
ios-app

Aradhana : ఇమేజే ప్రతిబంధకంగా మారిన ఆరాధన

  • Published Mar 21, 2022 | 8:30 PM Updated Updated Dec 23, 2023 | 6:34 PM

ఓ ఉదాహరణ చూద్దాం. 1986. తమిళంలో సత్యరాజ్ హీరోగా భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన కడలోర కవితైగల్ అద్భుత విజయం సాధించింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ రా ఎమోషనల్ డ్రామాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సహజంగానే రీమేక్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ హక్కులు సొంతం చేసుకున్నారు.

ఓ ఉదాహరణ చూద్దాం. 1986. తమిళంలో సత్యరాజ్ హీరోగా భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన కడలోర కవితైగల్ అద్భుత విజయం సాధించింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ రా ఎమోషనల్ డ్రామాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సహజంగానే రీమేక్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ హక్కులు సొంతం చేసుకున్నారు.

Aradhana : ఇమేజే ప్రతిబంధకంగా మారిన ఆరాధన

స్టార్ హీరోలకు తమ ఇమేజ్ కి ఎదురీది కొత్త తరహా సినిమాలు ప్రయోగాలు చేయాలని ఉంటుంది కానీ బిజినెస్ లెక్కలు వాటిని రిస్క్ పడేస్తూ ఉంటాయి. నటన పరంగా అవి ఎంత సంతృప్తి కలిగించినా అభిమానుల కోణంలో అంచనాలు అందుకోలేక ఫెయిల్యూర్స్ గా నిలిచిపోతాయి. ఓ ఉదాహరణ చూద్దాం. 1986. తమిళంలో సత్యరాజ్ హీరోగా భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన కడలోర కవితైగల్ అద్భుత విజయం సాధించింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ రా ఎమోషనల్ డ్రామాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సహజంగానే రీమేక్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ హక్కులు సొంతం చేసుకున్నారు.

రాక్షసుడు, దొంగ,మొగుడు లాంటి కమర్షియల్ సూపర్ హిట్స్ తో చిరంజీవి ఫ్యాన్స్ ఆయన్నుంచి అలాంటి చిత్రాలే డిమాండ్ చేస్తున్న టైం అది. కానీ కడలోర కవితైగల్ విపరీతంగా నచ్చేసింది. బావా బావమరుదులు ఇద్దరికీ అందులో రిస్క్ కనిపిస్తోంది కానీ వదులుకోవడం ఇష్టం లేదు. అందులోనూ భారతీరాజా తనే తీస్తానని ముందుకొచ్చారు. ఎక్కువ ఆలోచన చేయకుండా వెంటనే ఆరాధనను పట్టాలెక్కించారు. సుహాసిని హీరోయిన్ గా రాజశేఖర్ ఒక కీలక పాత్రకు ఎంపిక కాగా ఇళయరాజా సంగీతాన్ని ఒరిజినల్ వెర్షన్ నుంచి యధాతథంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫీల్ పోకుండా ఉండాలనే ఉద్దేశంతో మాస్ట్రో ఒకే అన్నారు.

చదువు సంధ్యలు లేని పులిరాజు మొరటోడు. కానీ ఓ టీచర్ మంచితనం పట్ల ఆకర్షితుడై తనలో మార్పు తెచ్చుకుంటాడు. ఆమె పట్ల పెంచుకున్న ఆరాధన తన సొంతం కాదనే పరిస్థితులు తలెత్తుతాయి. ఈ పాయింట్ మీద ఆరాధన సాగుతుంది. చిరంజీవి ఎంత అద్భుతంగా నటించినా ఫ్రేమ్ టు ఫ్రేమ్ తమిళ ఫార్మట్ ని ఫాలో కావడంతో నేటివిటీ సమస్యతో పాటు ఆ రానెస్ ని మనవాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. 1987 మార్చ్ 23న విడుదలైన ఆరాధన ఫ్లాప్ బారిన పడక తప్పలేదు. రెండు వారాల కంటే ఎక్కువ థియేటర్లలో నిలువలేకపోయింది. మోహన్ బాబు లాంటి ఆర్టిస్టు చేయాల్సిన పాత్రను చిరంజీవి చేయడం వల్లే ఆరాధన పరాజయం పాలయ్యింది.

Also Read : Gouramma Nee Mogudu Evaramma : క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి హీరోయిన్ గా సినిమా – Nostalgia