iDreamPost
android-app
ios-app

ఒక తరాన్ని ఊపేసిన జగన్మోహిని

  • Published Feb 19, 2022 | 11:25 AM Updated Updated Dec 06, 2023 | 12:40 PM

చిన్న తారలతో ఏదైనా ప్రయోగం లాంటిది చేసి పిల్లా పెద్ద అందరూ మెచ్చుకునే ఒక ఎంటర్ టైనర్ ఆయన మనసులో మెదిలింది. అదే జగన్మోహిని. ఎప్పుడో 50వ దశకంలో కన్నడలో ఇదే పేరుతో వచ్చిన సూపర్ హిట్ మూవీని స్ఫూర్తిగా తీసుకున్నారు.

చిన్న తారలతో ఏదైనా ప్రయోగం లాంటిది చేసి పిల్లా పెద్ద అందరూ మెచ్చుకునే ఒక ఎంటర్ టైనర్ ఆయన మనసులో మెదిలింది. అదే జగన్మోహిని. ఎప్పుడో 50వ దశకంలో కన్నడలో ఇదే పేరుతో వచ్చిన సూపర్ హిట్ మూవీని స్ఫూర్తిగా తీసుకున్నారు.

ఒక తరాన్ని ఊపేసిన జగన్మోహిని

1978 సంవత్సరం. జానపదబ్రహ్మగా మరపురాని ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు విఠలాచార్య స్వీయ విశ్లేషణలో ఉన్నారు. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో తన జానర్ నుంచి బయటికి వచ్చే సమయమని ఆయనకు అర్థమైపోయింది. అలా అని భారీ బడ్జెట్ లతో రిస్క్ చేసే ఆలోచనలోనూ లేరు. మొదట ఏదైనా దేవుడి కథను తీద్దామనుకున్నారు. వర్కౌట్ కాదని మిత్రులు వారించారు. చిన్న తారలతో ఏదైనా ప్రయోగం లాంటిది చేసి పిల్లా పెద్ద అందరూ మెచ్చుకునే ఒక ఎంటర్ టైనర్ ఆయన మనసులో మెదిలింది. అదే జగన్మోహిని. ఎప్పుడో 50వ దశకంలో కన్నడలో ఇదే పేరుతో వచ్చిన సూపర్ హిట్ మూవీని స్ఫూర్తిగా తీసుకున్నారు.

అప్పట్లో అది కర్ణాటకలో రికార్డులు సృష్టించిన చిత్రం. మళ్ళీ యధాతథంగా తీస్తే దెబ్బ పడొచ్చు. అందుకే చాలా నేర్పుగా దాన్నో కంప్లీట్ హారర్ కామెడీ సబ్జెక్టుగా మార్చి జికె మూర్తి, కర్పూరపు ఆంజనేయులుతో సంభాషణలు రాయించారు. విజయ కృష్ణమూర్తి సంగీతం అందించగా హెచ్ ఎస్ వేణు ఛాయాగ్రహణం సమకూర్చారు. హీరోగా ముందు ఏవేవో పేర్లు అనుకున్నప్పటికీ ఫైనల్ గా నరసింహరాజుని లాక్ చేసుకున్నారు. అప్పటికే అతనికి మంచి పేరుంది. ఈయన తల్లి పాత్ర చేసేందుకు మహానటి సావిత్రి గారు ఒప్పుకోవడం అప్పట్లో సంచలనం. భార్య క్యారెక్టర్ కు ప్రభ తన పెర్ఫార్మన్స్ తో బెస్ట్ ఛాయస్ అనిపించుకున్నారు.

కథలో భాగంగా ఇందులో పొట్టేలు, పులి,పాము కూడా భాగమయ్యాయి. మాయలు, మంత్రాలూ, రొమాన్స్, భక్తి, ప్రేమ, సరసం ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజీగా జగన్మోహనిని విఠలాచార్య తీర్చిదిద్దిన తీరు అమోఘం. 1978 ఆగస్ట్ 18న విడుదలైన ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు. సరిగ్గా వారం ముందు వచ్చిన ఎన్టీఆర్ సింహబలుడు పోటీని తట్టుకుని మరీ గొప్ప విజయం సాధించింది. ముఖ్యంగా బిసి సెంటర్స్ జనాలు వెర్రెక్కిపోయారు. కొన్న ప్రతిఒక్కరికి రూపాయకు మూడు రూపాయల లాభాన్ని తీసుకొచ్చింది. టెక్నాలజి లేని రోజుల్లోనే జగన్మోహిని పరిమిత బడ్జెట్ లో విఠలాచార్య తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ ఒక గొప్ప పాఠంగా చెప్పుకోవచ్చు

Also Read : Ghayal : ఆవేశానికి ప్రతీకగా బెస్ట్ కమర్షియల్ డ్రామా – Nostalgia