iDreamPost
1981 నాటికి అందాల నటుడు శోభన్ బాబు దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బలిపీఠం, గోరింటాకు సూపర్ హిట్ అయ్యాయి. మూడోసారి సెట్ చేసేందుకు ఎందరో నిర్మాతలు ప్రయత్నిస్తుండగా ఆ అవకాశం అప్పటికి ఒకే చిత్రం అనుభవం ఉన్న నిర్మాత సన్నపనేని సుధాకర్ కు దక్కింది.
1981 నాటికి అందాల నటుడు శోభన్ బాబు దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బలిపీఠం, గోరింటాకు సూపర్ హిట్ అయ్యాయి. మూడోసారి సెట్ చేసేందుకు ఎందరో నిర్మాతలు ప్రయత్నిస్తుండగా ఆ అవకాశం అప్పటికి ఒకే చిత్రం అనుభవం ఉన్న నిర్మాత సన్నపనేని సుధాకర్ కు దక్కింది.
iDreamPost
ఇప్పుడంటే ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ డ్రామాల సినిమాలు బాగా తగ్గిపోయాయి కానీ ఒకప్పుడు ఇవి రాజ్యమేలాయి. క్లాసు మాస్ తేడా లేకుండా అందరినీ అలరించాయి. ఓ చక్కని ఉదాహరణ చూద్దాం. 1981 నాటికి అందాల నటుడు శోభన్ బాబు దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బలిపీఠం, గోరింటాకు సూపర్ హిట్ అయ్యాయి. మూడోసారి సెట్ చేసేందుకు ఎందరో నిర్మాతలు ప్రయత్నిస్తుండగా ఆ అవకాశం అప్పటికి ఒకే చిత్రం అనుభవం ఉన్న నిర్మాత సన్నపనేని సుధాకర్ కు దక్కింది. మెయిన్ హీరోయిన్ గా జయప్రద, మురళీమోహన్, మోహన్ బాబుకు జోడిగా దీప, వడివక్కరుసులను తీసుకున్నారు.
మంచి ఎమోషన్స్ తో స్టోరీని రంగరించారు దాసరి. కథ మాటలతో సహా స్క్రిప్ట్ మొత్తం ఆయనదే. ఉద్యోగం కోసం వెతుకుతున్న ఇద్దరు నిరుద్యోగులకు(శోభన్ బాబు-మురళిమోహన్)మంచి మాటకారి అయిన మరో మిత్రుడు(మోహన్ బాబు)తోడవుతాడు. ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. ఆ ఓనర్ కూతురు(జయప్రద)నే శోభన్ పెళ్లి చేసుకుంటాడు. మోహన్ బాబుకు కండక్టర్ ఉద్యోగం రాగా ఆ బస్సు కంపెనీ యజమానిని మురళీమోహన్ వివాహం చేసుకుని ఇల్లరికం వెళ్తాడు. భార్యలు వచ్చాక వీళ్ళ జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహం కోసం తన భార్యనే పోగొట్టుకున్న శోభన్ బాబు ఆమె గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతాడు.
స్నేహం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలతో దాసరి గారు దీన్ని మంచి భావోద్వేగాలతో రూపొందించారు. మూడు భిన్నమైన జీవితాలను ముడిపెట్టి సగటు మధ్యతరగతి మనిషికి కనెక్ట్ అయ్యేలా చూపించిన తీరు దీపారాధనను సూపర్ హిట్ చేసింది. చక్రవర్తి స్వరపరిచిన పాటలకు మంచి పేరు వచ్చింది. కెఎస్ మణి ఛాయాగ్రహణం అందించగా రాజగోపాల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 1981 ఏప్రిల్ 11న విడుదలైన దీపారాధన 12 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం రికార్డు. దీనికి రెండు రోజుల ముందు వచ్చిన శోభన్ బాబు మరో సినిమా ఇల్లాలు కూడా సక్సెస్ కావడం విశేషం. ఎంత ఎమోషన్ ఉన్నా దీపారాధన ఇప్పటికీ చూడదగిన ఎంటర్ టైనర్
Also Read : Muta Mestri : మార్కెట్ కూలీ మంత్రి అయితే – Nostalgia