iDreamPost
ఏ కోదండరామిరెడ్డి దర్శకులు. ఇళయరాజా సంగీతం. సత్యమూర్తి(దేవిశ్రీప్రసాద్ తండ్రి)కి సంభాషణల బాధ్యతను అప్పగించారు. సాయినాధ్ స్క్రీన్ ప్లే అందించారు. నిరుద్యోగంతో బాధ పడే గాంధీ అనే యువకుడిని కోటీశ్వరుడైన రామ్మోహన్ రావు ఎగతాళి చేస్తాడు. దాంతో కసిపెరిగిన గాంధీ ఐదేళ్ళలో యాభై లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.
ఏ కోదండరామిరెడ్డి దర్శకులు. ఇళయరాజా సంగీతం. సత్యమూర్తి(దేవిశ్రీప్రసాద్ తండ్రి)కి సంభాషణల బాధ్యతను అప్పగించారు. సాయినాధ్ స్క్రీన్ ప్లే అందించారు. నిరుద్యోగంతో బాధ పడే గాంధీ అనే యువకుడిని కోటీశ్వరుడైన రామ్మోహన్ రావు ఎగతాళి చేస్తాడు. దాంతో కసిపెరిగిన గాంధీ ఐదేళ్ళలో యాభై లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.
iDreamPost
1984. చిరంజీవికి అప్పటికే యూత్ లో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఖైదీ నుంచే అభిమాన సంఘాలు మొదలయ్యాయి. అదే సమయంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన డబ్బు టు ది పవర్ అఫ్ డబ్బు నవల విపరీతమైన ఆదరణకు నోచుకుంది. దీన్ని సినిమాగా తీస్తే బాగా ఆడుతుందనే నమ్మకం నిర్మాత కెఎస్ రామారావుది. అప్పటికే అభిలాష తీసి అద్భుత విజయాన్ని అందుకున్న అనుభవం ఉందిగా. అందుకే నేరుగా ఈ ప్రతిపాదనను చిరు ముందు ఉంచేశారు. అసలు ఆ సీరియల్ లో గాంధీ పాత్రను రాసిందే చిరంజీవిని ఉద్దేశించి అన్నంత సహజంగా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది
ఏ కోదండరామిరెడ్డి దర్శకులు. ఇళయరాజా సంగీతం. సత్యమూర్తి(దేవిశ్రీప్రసాద్ తండ్రి)కి సంభాషణల బాధ్యతను అప్పగించారు. సాయినాధ్ స్క్రీన్ ప్లే అందించారు. నిరుద్యోగంతో బాధ పడే గాంధీ అనే యువకుడిని కోటీశ్వరుడైన రామ్మోహన్ రావు ఎగతాళి చేస్తాడు. దాంతో కసిపెరిగిన గాంధీ ఐదేళ్ళలో యాభై లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఎన్ని అడ్డంకులు కుట్రలు ఎదురైనా చివరికి లక్ష్యం చేరుకొని ఆయన కూతురిని గెలుచుకున్నా సరే తృణప్రాయంగా తిరస్కరిస్తాడు. ఇదే కథలోని మెయిన్ పాయింట్. ఓ బిచ్చగత్తె ఇచ్చిన పది పైసల బిళ్ళతో మొదలుపెట్టి లక్షలు సంపాదించే క్రమాన్ని తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచింది.
గాంధీగా చిరంజీవి నటన యువతనే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ కి సైతం విపరీతంగా ఎక్కేసింది. ఇందువదన కుందరదన పాట హోరెత్తిపోయింది. రావు గోపాల్ రావు విలనీ, గొల్లపూడి-సిల్క్ స్మిత పాత్రలు భలేగా పేలాయి. విజయశాంతి హుందా నటన, సుహాసిని పెర్ఫార్మన్స్ సినిమా స్థాయిని పెంచాయి. నవలలో చాలా ప్రాముఖ్యం ఉన్న విద్యార్ధి పాత్రను రాజేంద్రప్రసాద్ పోషించారు. నిడివి కోసం ఈ క్యారెక్టర్ ని బాగా కుదించేశారు. 1984 ఆగస్ట్ 9న ఛాలెంజ్ రిలీజై వంద రోజుల ప్రదర్శన జరుపుకుంది. అదే రోజు రిలీజైన బంగారు కాపురం, ప్రేమసంగమం పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. మెగాస్టార్ కు మైల్ స్టోన్ గా నిలిచింది
Also Read : Kondaveeti Simham : పోలీసు దుస్తుల్లో అన్నగారి విశ్వరూపం – Nostalgia