iDreamPost
1978. కలర్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఎన్టీఆర్ దానవీరశూర కర్ణ-అడవి రాముడు, కృష్ణ అల్లూరి సీతారామరాజు లాంటివి చూశాక బ్లాక్ అండ్ వైట్ బొమ్మలంటే జనం అంతగా ఆసక్తి చూపించడం లేదు.
1978. కలర్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఎన్టీఆర్ దానవీరశూర కర్ణ-అడవి రాముడు, కృష్ణ అల్లూరి సీతారామరాజు లాంటివి చూశాక బ్లాక్ అండ్ వైట్ బొమ్మలంటే జనం అంతగా ఆసక్తి చూపించడం లేదు.
iDreamPost
1978. కలర్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఎన్టీఆర్ దానవీరశూర కర్ణ-అడవి రాముడు, కృష్ణ అల్లూరి సీతారామరాజు లాంటివి చూశాక బ్లాక్ అండ్ వైట్ బొమ్మలంటే జనం అంతగా ఆసక్తి చూపించడం లేదు. అయినా కూడా రంగుల్లో తీసేంత బడ్జెట్ లేని నిర్మాతలు నలుపు తెలుపులోనే తమ కలలు తీర్చే ప్రతిభ ఉన్న దర్శకులను వెతికేవారు. వాళ్లలో గొప్ప విజయాలు సాధించిన వారు ఉన్నారు. విజయా సంస్థలో పనిచేసిన అనుభవంతో మురారి ఓ సినిమా నిర్మించాలనే సంకల్పంతో ఉన్నారు. విపరీతమైన ఖర్చు లేకుండా తన అభిరుచికి అనుగుణంగా ఏదైనా కథ దొరికితే తాను స్థాపించిన యువచిత్ర బ్యానర్ కు డెబ్యూ మూవీ గొప్పగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు.
కళాతపస్వి కె విశ్వనాథ్ తో తన ఆలోచన పంచుకున్నప్పుడు సీతామాలక్ష్మి కథ పుట్టింది. టూరింగ్ టాకీసులో పని చేసే కల్లాకపటం తెలియని ఓ జంట. ఆ అమ్మాయి నిజ జీవితంలో హీరోయిన్ అయ్యాక ఆ అబ్బాయి దూరమవుతాడు. చివరికి తాత్కాలికమైన హంగుల కంటే స్వచ్ఛమైన ప్రేమ గొప్పదని గురించిన సీతాలు మళ్ళీ తనవాడి దగ్గరకే వస్తుంది. ఇదీ కథలో మెయిన్ పాయింట్. దీనికి జంధ్యాల తనదైన మార్కు ట్రీట్ మెంట్ తో అద్భుతమైన సంభాషణలు సమకూర్చారు. చెప్పడానికి చిన్న సినిమానే అయినప్పటికీ ఫైనల్ వెర్షన్ లాక్ చేసేందుకు ఏడాదిన్నర పట్టిందంటేనే నిర్మాత మురారి పర్ఫెక్షన్ కోసం ఎంతగా తపించారో అర్థమవుతుంది.
హీరోగా చంద్రమోహన్ ను తీసుకున్నారు. హీరోయిన్ గా తిరుపతికి చెందిన తాళ్ళూరి రామేశ్వరిని ఎంచుకుని తెరకు పరిచయం చేశారు. ఈవిడే మహేష్ బాబు నిజంలో తల్లిగా నటించారు. కెవి మహదేవన్ గొప్ప పాటలు ఇచ్చారు. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, మావిచిగురు తినగానే రేడియోలో మారుమ్రోగిపోయాయి. 1978 ఫిబ్రవరి 24న విడుదలైన సీతామాలక్ష్మి అద్భుత విజయం అందుకుంది. ఇందులో ఎమోషన్ కి మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. దీని స్ఫూర్తితోనే రామ్ గోపాల్ వర్మ మాడరన్ స్టైల్ లో రంగీలా తీశారు. రెండిట్లో థీమ్ చాలా దగ్గరగా ఉంటుంది. ఈ విషయాన్ని వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read : Nuvve Nuvve : చక్రబంధంలో త్రివిక్రమ్ నువ్వే నువ్వే – Nostalgia