iDreamPost
నచ్చితే సూపర్ హిట్ చేయండి లేకపోతే టపా కట్టించి ఇంటికి పంపడం. ఓసారి ఇరవై ఏళ్ళు వెనక్కు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 2002 నాటి ముచ్చట్లు చూద్దాం.
నచ్చితే సూపర్ హిట్ చేయండి లేకపోతే టపా కట్టించి ఇంటికి పంపడం. ఓసారి ఇరవై ఏళ్ళు వెనక్కు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 2002 నాటి ముచ్చట్లు చూద్దాం.
iDreamPost
కంటెంట్ ఉంటేనే సినిమాకు ప్రేక్షకులు పట్టం కడతారనే సత్యం ఇప్పుడే కాదు దశాబ్దాలుగా ఋజువవుతున్నదే. చిన్న హీరో ఉన్నాడా లేక స్టార్ హీరోదా అనే లెక్కలు ఉండవు. నచ్చితే సూపర్ హిట్ చేయండి లేకపోతే టపా కట్టించి ఇంటికి పంపడం. ఓసారి ఇరవై ఏళ్ళు వెనక్కు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 2002 నాటి ముచ్చట్లు చూద్దాం. అక్టోబర్ నెల. అప్పటికి బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ చివరి వారంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఒకటే స్ట్రాంగ్ గా ఉంది. టాక్ డివైడ్ గా ఉన్నా కమర్షియల్ పాయింట్ అఫ్ వ్యూలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇంకా బలమైన సినిమాల కోసం వేచి చూస్తున్న తరుణం. 2న గాంధీ జయంతి సందర్భంగా ‘జెండా’ను విడుదల చేశారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో అందరూ కొత్త కుర్రాళ్లతో చేసిన ఈ పొలిటికల్ ప్రయోగం వికటించింది. ఒకప్పుడు అద్భుతమైన రాజకీయ నేపధ్యం కలిగిన సినిమాలు తీసిన కోడి నుంచి ఆశించిన అవుట్ ఫుట్ ఇది కాకపోవడంతో జనం నో చెప్పారు. 4న వచ్చిన క్యాష్, ఫైర్ ఫైటర్, ఇన్స్ పెక్టర్ విక్రమ్, ప్రేమదొంగ నాలుగూ ఫ్లాప్ ముద్ర వేయించుకున్నాయి. 10న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా డెబ్యూ మూవీ ‘నువ్వే నువ్వే’ విడుదలయ్యింది. ఫాదర్ సెంటిమెంట్ మెయిన్ థ్రెడ్ గా రూపొందిన ఈ లవ్ స్టోరీ హిట్టు కొట్టింది. కోటి పాటలు దీని లెవెల్ ని పెంచాయి. మరీ నువ్వే కావాలి స్థాయి కాదు కానీ తరుణ్ మార్కెట్ పెరిగేందుకు ఇది ఉపయోగపడింది.
ఒక్క రోజు గ్యాప్ తో 11న రిలీజైన వెంకటేష్ రీమేక్ మూవీ ‘జెమిని’ నిరాశపరిచింది.మాస్ క్యారెక్టర్ లో వెంకీ బెస్ట్ ఇచ్చినప్పటికీ ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. 12 ప్రశాంత్ డబ్బింగ్ మూవీ ‘మజ్ను’ని ఎవరూ పట్టించుకోలేదు. 18న హేరాఫెరీ రీమేక్ ధనలక్ష్మి ఐ లవ్ యు, పిలిస్తే పలుకుతా, రోజా లీడ్ రోల్ చేసిన పోలీస్ సిస్టర్స్, విజయ్ కాంత్ సెక్యూరిటీ ఆఫీసర్ అన్నీ దెబ్బ తిన్నాయి. 25న లేడీ బ్యాచిలర్స్, ప్రత్యుషలకు కనీస స్పందన రాలేదు. చివరి రోజు 31న భారీ హైప్ తో వచ్చిన మహేష్ బాబు బాబీ ఘోరంగా డిజాస్టర్ కావడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అలా ఆ నెల మొత్తానికి కలిపి నువ్వే నువ్వే విన్నర్ కాగా జెమిని, బాబీ దెబ్బ కొట్టాయి
Also Read : Jodi : యాక్షన్ దర్శకుడు ప్రేమకథ చేస్తే – Nostalgia