iDreamPost

గర్భంతో ఉన్న మహిళకు క్షమాపణలు చెప్పిన జొమాటో! ఎందుకంటే..?

  • Published May 20, 2024 | 1:35 PMUpdated May 20, 2024 | 1:35 PM

ఇటీవల కాలంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీల్లో జరుగుతున్న పొరపాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కస్టమర్‌  కు ఇలాంటి కస్టమర్‌ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇంతకి ఏం జరిగిందంటే..  

ఇటీవల కాలంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీల్లో జరుగుతున్న పొరపాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కస్టమర్‌  కు ఇలాంటి కస్టమర్‌ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇంతకి ఏం జరిగిందంటే..  

  • Published May 20, 2024 | 1:35 PMUpdated May 20, 2024 | 1:35 PM
గర్భంతో ఉన్న మహిళకు క్షమాపణలు చెప్పిన జొమాటో! ఎందుకంటే..?

ఇటీవల కాలంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీల హవా ఎ‍ంత ఎ‍క్కువగా  నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు.  అయితే వాటిలో జరిగే పొరపాట్లు కూడా అంతే  ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లకు ఈ  ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ ల వలన ఎదురయ్యే చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కాదు. ఈ మధ్య తరుచు ఎక్కడ చూసిన ఈ ఆన్‌ ఫుడ్‌ డెలవరీ  అనేది కస్టమర్లకు నాణ్యత లేని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా.. కస్టమర్లు ఒక ఫుడ్‌ ను ఆర్డర్‌ చేస్తుంటే.. మరొక ఫుడ్‌ ను డెలివరీ చేసి కస్టమర్లకు నిరాశ పరిచేలా చేస్తుంది. తాజాగా ఈ క్రమంలోనే ఓ కస్టమర్‌  కు ఇలాంటి కస్టమర్‌ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఇంతకి ఏం జరిగిందంటే..  
తాజాగా  ఆర్డర్ పెట్టిన ఫుడ్‌కు బదులు మరో ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో.. ఓ మహిళకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన శోభిత్ సిద్ధార్ధ అనే వ్యక్తి కడుపుతో ఉన్న తన భార్య కోసం పనీర్ థాలీ ఆర్డరిచ్చాడు. అయితే ఆ ఫుడ్‌ ఇంటికి డెలివరీ అయ్యేక దానిని తెరిచి చూసిన కస్టమర్‌ ఒక్కసారిగా షాకైయ్యాడు. ఎందుకంటే.. తాను ఆర్డర్‌ చేసిన పనీర్ థాలీకి బదులు  ఇంటికి చికెన్ థాలీ డెలివరీ అయ్యేసరికి ఆ కస్టమర్‌ నిరాశకు గురయ్యాడు. ఇ​క వెంటనే ఈ విషయం పై జొమాటోను ట్యాగ్ చేస్తూ సోషల్‌ మీడియాలో  ఫిర్యాదు చేశాడు. కాగా, అందులో పనీర్ థాలీ ఆర్డరిస్తే వెజిటేరియన్ థాలీ ఎలా డెలివరీ చేశారో జొమాటో చెప్పాలి. ఓ వెజిటేరియన్ చికెన్ తినగలదా? ఆమె ప్రస్తుతం కడుపుతో ఉంది. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?’’ అని ప్రశ్నించాడు.
Zomato apologizes to Garbhini! 02
ఇక ఈ పోస్ట్‌ కాస్త సోషల్‌  మీడియాలో వైరల్‌ కావడంతో.. నెట్టింట  వెంటనే  భారీ స్పందన వచ్చింది. అనేక మంది నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తడంతో జొమాటో వెంటనే స్పందించింది. అయితే పొరపాటు జరిగిందని అంగీకరించిన సంస్థ, కస్టమర్‌కు క్షమాపణలు చెప్పింది. కస్టమర్ల అభిరుచుల విషయంలో తాము పక్కాగా ఉంటామని, ఇది కావాలని చేసింది కాదని వివరణ ఇచ్చింది. ఈ విషయంపై విచారిస్తామన్న సంస్థ, తదుపరి చర్యల గురించి ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదిస్తామని చెప్పుకొచ్చింది.
కాగా, గతంలోనూ అనేక మంది యాప్‌లల్లో ఫుడ్ ఆర్డరిచ్చి ఇబ్బందుల పాలయ్యారు. ఇటీవల పనీర్ బిర్యానీ ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి చికెన్ బిర్యానీ డెలివరీ కావడంతో షాకయ్యారు. ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగుచూడటంతో అనేక మంది సంస్థ పాటిస్తున్న పద్ధతులు, ప్రమాణాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి, కస్టమర్‌ కు పనీర్ థాలీకి బదులు  ఇంటికి చికెన్ థాలీ డెలివరీ అయ్యే సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి