నాడు చంద్ర‌బాబు ఆపేసాడు , నేడు జగన్ 1400 కోట్లు విడుదల చేసాడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో డ్వాక్రా మ‌హిళ‌ల సంక్షేమం విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో అడుగు వేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన అన్యాయాన్ని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేసింది. అందులో భాగంగా వైఎస్సార్ ప్ర‌భుత్వం ప్రారంభించిన సున్నా వడ్డీ స్కీమ్ ని మ‌ళ్లీ తెర‌మీద‌కు తెచ్చారు. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన మాట‌కు అనుగుణంగా త‌న విధానాన్ని రూపొందించారు. చెప్పాడంటే..చేస్తాడంతే అనే విధంగా సాగుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌లో ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడుతున్నా మ‌హిళ‌ల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషంగా మారుతోంది.

డ్వాక్రా గ్రూప్ మ‌హిళ‌ల‌ కోసం వైస్సార్ సున్నా వ‌డ్డీ ప‌థ‌కానికి ఒకేసారి రూ. 1400 కోట్ల నిధుల‌ను జ‌గ‌న్ విడుదల చేశారు.అంత‌కుముందు 2016-17లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం 980 కోట్లు చెల్లించాల్సి ఉండ‌గా కేవ‌లం 382 కోట్లు కేటాయించింది. 2017-18లో మాత్రం 1134 కోట్లు కేటాయించాల్సి ఉండ‌గా నిధులు కేటాయించ‌లేదు. 2018-19లో కూడా 1320 కోట్లు అందించాల్సి ఉన్నా చంద్ర‌బాబు స్పందించ‌లేదు. పైగా అసెంబ్లీ సాక్షిగా అంత‌కుముందు ఎన్నిక‌ల్లో చెప్పిన విధానానికి విరుద్ధంగా ప్ర‌క‌ట‌న చేశారు. డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల‌న్నీ మాఫీ చేస్తామ‌ని 2014లో చెప్పిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత యూట‌ర్న్ తీసుకున్నారు.

కానీ తాజాగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో 90.37ల‌క్ష‌ల మంది డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ల‌బ్ది చేకూర‌బోతోంది. 8,78,874 పొదుపు సంఘాల్లో ఉన్న వారికి ప్ర‌యోజ‌నం ద‌క్కేలా ప్ర‌భుత్వం నిధులు కేటాయించింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ ఈ స్కీమ్ ప్రారంభించారు. దాంతో మ‌హిళ‌ల‌కు పెద్ద స్థాయిలో మేలు క‌ల‌గ‌బోతోంది. ముఖ్యంగా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు సంబంధించిన వడ్డీల భారం నుంచి మ‌హిల‌ల‌కు విముక్తి ల‌భిస్తుంది. ప్ర‌భుత్వ‌మే వ‌డ్డీ భారం భ‌రించ‌డంతో స‌న్నా వ‌డ్డీ రుణాల ప‌థ‌కం డ్వాక్రా మ‌హిళ‌ల‌కు కొండంత ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌బోతోంది.

గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వంలో దీనిని ప్రారంభించి ఆయ‌న సీఎంగా ఉన్నంత కాలం అమ‌లు చేశారు. కానీ అనంత‌రం రోశ‌య్య‌, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏటా నిధులు విడుద‌ల చేయ‌గా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. దాంతో నిరుపేద డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పెనుభారం అయ్యింది. మహిళలకు లబ్ది చేకూర్చే ఇలాంటి పథకాలను చంద్రబాబు నిలిపేసి ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో హడావుడి చేసినా మహిళలు నమ్మలేదు.. సంక్షేమపథకాలు కేవలం ఎన్నికల పథకాలు కాకుడదు.

ఇక ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం ఏడాది నిండ‌కుండానే డ్వాక్రా రుణాల వ‌డ్డీకి సంబంధించిన నిధుల‌ను జ‌గ‌న్ కేటాయించ‌డం ప‌ట్ల మ‌హిళ‌లంతా హ‌ర్షాతికేతాలు వ్య‌క్తం చేస్తున్నారు. నేరుగా సీఎం నిర్వ‌హించిన వీడియోకాన్ఫ‌రెన్స్ లో వివిధ జిల్లాల డ్వాక్రా మ‌హిళ‌లు త‌మ సంతృప్తి , ఆనందం వ్య‌క్తం చేశారు.

Show comments