iDreamPost
android-app
ios-app

మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం

మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే పలు పధకాలు అమలు చేసిన జగన్ సర్కార్ మరో పధకం అమలుకు రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాల 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలను అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు గ్రామ, వార్డు వాలంటీర్లు అర్హులను ఎంపిక చేయనున్నారు.

ఇవీ మార్గదర్శకాలు..

– ఒక్కో కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు.. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉండాలి.

– కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పదెకరాల్లోపు మెట్ట భూమి ఉండొచ్చు.

– కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరూ ఆదాయ పన్ను చెల్లించి ఉండకూడదు.

– పట్టణ ప్రాంతాల్లో 750 చ. అడుగుల్లోపు నిర్మిత భవనం ఉన్నా అర్హులే.

– 45–60 ఏళ్లలోపు వయసు ఉన్నట్లు ధ్రువీకరించే ఇంటిగ్రేటెడ్‌ క్యాస్ట్‌ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఓటర్‌ గుర్తింపు కార్డు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్‌ కార్డు గానీ ఉండాలి.

– కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు.

– కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అనర్హులు. పారిశుధ్య ఉద్యోగులు ఉంటే అర్హులే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి