iDreamPost
android-app
ios-app

‘మా అమ్మానాన్నలు నాకు పెళ్లి చేయట్లేదు సార్’ అంటూ పోలీసులకు ఫిర్యాదు

  • Published May 14, 2022 | 6:11 PM Updated Updated May 14, 2022 | 6:11 PM
‘మా అమ్మానాన్నలు నాకు పెళ్లి చేయట్లేదు సార్’ అంటూ పోలీసులకు ఫిర్యాదు

‘మా అమ్మానాన్నలు నాకు పెళ్లి చేయట్లేదు సార్’ అంటూ ఓ 26 ఏళ్ల నవ యువకుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్ చెందిన 26 ఏళ్ల అజీమ్ మన్సూరీ అనే మరగుజ్జు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 3 అడుగుల రెండు అంగుళాల‌ పొడవు మాత్ర‌మే ఉండే మ‌రుగుజ్జు మన్సూరీ తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయట్లేదంటూ వాపోయాడు. తనకు పెళ్లి కావ‌ట్లేద‌ని, పిల్ల దొర‌క‌ట్లేద‌ని గ‌తంలో కూడా ఓ సారి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి, సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. ‘పెళ్లెప్పుడు అవుతంది బాబూ నాకు పిల్ల ఏడ దొరకుతుంది బాబూ’ అంటూ నానా తంటాలు పడుతున్నాడు మరుగుజ్జు మన్సూరీ. త‌న పెళ్లి ఎప్పుడు జరుగుతుందా? అని చాలా కాలంగా ఎదురుచూపులు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ యువ‌కుడికి మ‌రో క‌ష్టం వ‌చ్చింది.

త‌న‌కు పిల్ల దొరికింద‌ని.. అయితే, త‌న త‌ల్లిదండ్రులు పెళ్లి చేయ‌కుండా ఆల‌స్యం చేస్తున్నార‌ని అంటున్నాడు. అంతేనా..నాకు పిల్ల దొరకటమే అదృష్టం అనుకుంటే తన తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయటానికి ఆసక్తి చూపించకపోవటం దురదృష్టం అని వాపోతూ పోలీసులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. త‌ల్లిదండ్రుల మీద పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి శామ్లీ స్టేషన్ ఇన్‌ఛార్జికి ఫిర్యాదు చేశాడు.

హాపుఢ్ జిల్లా కేంద్రానికి చెందిన యువతితో త‌న‌కు గ‌త ఏడాది పెళ్లి నిశ్చయమైందని..కానీ నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయ‌ట్లేద‌ని.. కొన్ని రోజుల తర్వాత ఘ‌నంగా వివాహం చేస్తామ‌ని చెప్పుకొస్తే కాలం గడుపుతున్నారని వాపోయాడు. కానీ వారు ఎప్పుడు చేస్తారో తెలీదు. అప్పటి వరకు నేను ఎదురు చూస్తుండలేను అంటూ పోలీసుల‌కు అజీమ్ మన్సూరీ చెప్పాడు.

మన్సూర్ ఇచ్చి ఫిర్యాదు విని చిరునవ్వులు నవ్వుకున్న పోలీసులు అతని వివాహం విషయమై అతడి తల్లిదండ్రులతో మాట్లాడతామని చెప్పారు. ఘజియాబాద్ కు చెందిన రెహానా అనే రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న రెహానాకు 2021లో అజీమ్ తో పెళ్లి నిశ్చ‌య‌మైంది. కానీ 2022 ఏడాది వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా వివాహం చేయట్లేదని మన్సూరి గోల గోల చేస్తున్నాడు. మరి అతని ‘పెళ్లి గోల’ఎప్పటికి తీరేనో..!