iDreamPost
android-app
ios-app

తొలి ఏకాదశి రోజున ఇలా పూజలు చేయండి.. సిరి సంపదలు కలుగుతుంది!

తొలి ఏకాదశి రోజున ఇలా పూజలు చేయండి.. సిరి సంపదలు కలుగుతుంది!

ఏడాది పొడవున హిందువులు ఎన్నో పండగలను జరుపుకుంటారు. ప్రతి పండగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలానే జూన్ 29న తొలి ఏకాదశిగా పండగ ఉంది. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే రోజును తొలిఏకాదశిగా పరిగణిస్తారు. విష్ణు మూర్తి పవళించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. ఈ పండగ రోజున దేవుడిని పేలాల ప్రసాదంతో పూజిస్తారు కాబట్టి పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండగ రోజు ఎంతో పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజలు చేస్తే.. సిరి సంపదలు కలుగుతాయని పండితులు అంటున్నారు.

తొలి ఏకాదశి పండగ నాడు రోజంతా ఉపవాసం ఉండి, అలానే రాత్రికి జాగారం చేస్తే మంచిదంటే. అలా జాగారం చేసి.. మరుసటి రోజు అనగా ద్వాదశి ఉదయం తెల్లవారు జామున లేచి, స్నానమాచరించి, విష్ణుమూర్తిని కొలిచి, తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తే.. సిరి సంపదలు కలుగుతాయి. అలానే జన్మజన్మల పాపాలకు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ మహా విష్ణువును పూజిస్తే.. ఇంట్లో ఉన్న దారిద్రం తొలగిపోయి.. కోటీశ్వరులు అవుతారట. మన పెద్దలు రావి చెట్టును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు. శని ప్రభావం ఎక్కువ ఉన్నవారు రావి చెట్టును పూజలు చేస్తే మంచిందట. రావి చెట్టును పూజించడం వల్ల కష్టాలు, బాధలు తొలగిపోతాయి.

తొలి ఏకాదశి రోజున ఈ రావి చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేసి.. కాస్త నీళ్లు పోసి.. దీపారాధన చేస్తే.. పాపాలు తొలగిపోతాయట. శని ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో రావి చెట్టును పూజించడానికి కారణం ఇదే. దీనికి పూజిస్తే దీర్ఘ అయుస్సుతో పాటు శని ప్రభావం తొలగిపోయి.. ఆ ఇళ్లు సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలతో కళకళలాడుతూ ఉంటుందట. రావి చెట్టును పూజించే తన భక్తులు సుఖ సంతోసాలు, అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారని విష్ణువు వరమిచ్చారంట. అందుకే శని ప్రభావం ఎక్కువ ఉన్న సమయంలో రావి చెట్టును పూజిస్తారు. రావి చెట్టును పూజిస్తే దీర్ఘ అయుస్సుతో పాటు శని ప్రభావం తొలగిపోతాయంట. అలానే ఆ ఇళ్లు సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలతో కళకళలాడుతూ ఉంటుందట. మరి.. ఈ పూజ విశేషలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.