iDreamPost
android-app
ios-app

Chandrababu, YCP, Kuppam Municipality – చంద్రబాబుకు బిగ్ షాక్.. కుప్పంలో మెజారిటీ మార్క్‌ను చేరుకున్న వైసీపీ

Chandrababu, YCP, Kuppam Municipality – చంద్రబాబుకు బిగ్ షాక్..  కుప్పంలో మెజారిటీ మార్క్‌ను చేరుకున్న వైసీపీ

కుప్పం మున్సిపాలిటీ అయిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ దూసుకపోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో మెజారిటీ సీట్లను గెలుచుని.. కుప్పంను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 25 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా.. మిగతా 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం వార్డులను రెండు విడతల్లో లెక్కించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 1 నుంచి 15వ వార్డు వరకు ఓట్ల లెక్కింపు చేపట్టారు.

మొదటి విడత ఓట్ల లెక్కింపులో వైసీపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. 14 వార్డుల ఓట్లను లెక్కించగా.. అందులో వైసీపీ 12 వార్డులను గెలుచుకుంది. మరో రెండు వార్డులలో టీడీపీ విజయం సాధించింది. ఏకగ్రీవమైన వార్డుతో కలపి వైసీపీ గెలుచుకున్న వార్డుల సంఖ్య 13గా ఉంది. ఇంకా 10 వార్డుల ఫలితం రావాల్సి ఉంది. 16 నుంచి 25వ వార్డు వరకు ఉన్న వార్డుల ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. మొదటి విడత ఫలితాల్లోనే పాలక మండలిని ఏర్పాటు చేసే మేజిక్‌ ఫిగర్‌ను వైసీపీ చేరుకుంది. 25 వార్డులకు గాను 13 వార్డులు వచ్చిన పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది.

మూడు దశాబ్ధాలుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్న చంద్రబాబుకు.. ఈ ఫలితాలు ఏ మాత్రం రుచించేవి కావు. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో ఎదురైన పరాభవాల నుంచి గట్టెక్కడానికి మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించాలని చంద్రబాబు భావించారు. అందుకే ఎప్పుడూ లేనిది మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో కుప్పంలోని 25 వార్డులను కలియ తిరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం నామినేషన్‌ వేసేందుకు కూడా రాని చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో కుప్పంకి రావడం, ప్రచారం చేయడంతో ఎన్నికలకు ముందే టీడీపీ పరిస్థితిపై ఓ అవగాహన వచ్చింది.

చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్‌ కూడా కుప్పంలో ప్రచారం చేశారు. అయినా.. ఆ పార్టీ ఓటమి వైపు పయనిస్తోంది. టీడీపీ ఓటమి ఖరారైంది. అయితే ఆ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనేది మరికొద్ది సేపట్లో తెలిపోతుంది. గట్టి పోటీ ఉంటుందనే అనుమానంతోనే.. చంద్రబాబు కుప్పం మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా ఓటు నమోదు చేసుకున్నారు. అయితే వైసీపీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తున్న తరుణంలో… చంద్రబాబుకు ఓటింగ్‌లో పాల్గొనే అవసరం లేనట్లే.

Also Read : Darsi Municipality – బోణికొట్టిన టీడీపీ.. దర్శి నగర పంచాయతీ కైవసం