iDreamPost
iDreamPost
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. పార్లమెంట్ ఎన్‌ఎక్స్ భవన్‌లో సమావేశమైన 13 విపక్ష పార్టీలు ఉమ్మడిగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ తోపాటు, టీఎంసి, సమాజ్ వాదీపార్టీలు ఆయనకు మద్దతిచ్చాయి. బీజేపీకి కొరకరాని కొయ్యిలా మారి, కొన్నేళ్లుగా ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శిస్తున్న యశ్వంత్ సిన్హా దేశవ్యాప్తంగా తెలిసినపేరు. 2002లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా యశ్వంత్ సిన్హా పనిచేశారు. మోదీ టీంతో సరిపడక 2018లో యశ్వంత్ సిన్హా బీజేపీకి రాజీనామా చేశారు. 2021లో తృణమూల్‌లో చేరారు. ఇప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీపడుతున్నారుకాబట్టి, యశ్వంత్ సిన్హా మంగళవారం ఉదయం టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ లో ప్రకటించారు.
మరాఠాయోధుడు పవార్, గోపాల్ కృష్ణ గాంధి, ఫారూఖ్ అబ్ధుల్లా పేర్లను ముందు పరిశీలించినా, వీరెవ్వరూ పోటీకి సిద్ధంగాలేరు. మంగళవారం నాటి సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, సిపిఐ, సిపిఎం, సమాజ్ వాదీపార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఏఐఎంఐఎం, ఆర్జేడీ, ఏఐయుడిఎఫ్ లు హాజరైయ్యాయి. సిన్హాకు ఏకగ్రీవంగా మద్దతునివ్వాలని విపక్షాలన్నీ ఉమ్మడి ప్రకటనలో బీజేపీని కోరాయి.