భారతదేశంలో పొడవైన ఉపనదిగా యమనకు పేరుంది. అనేక రకాలుగా ఈ నీటిని ప్రజలు తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లో విస్తరించింది యమన. ఇంత పెద్ద ఉపనదికి ఇప్పుడు కష్టమొచ్చింది. నీళ్ళు లేక అనేక ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందిపడుతున్న పరిస్థితి ఉంది. ఆనాడు శ్రీ కృష్ణుడు నడయాడిన యమున ఇప్పుడెలా ఉంది?
వాతావరణ మార్పులు, పెరగుుతున్న ఉష్ణోగ్రతలతో వేసవిలో యమనా నది రోజురోజుకు ఎండిపోతోంది. వేసవిలో యమనా నదిలో నీరు తగ్గిపోతోంది. దీంతో దిల్లీ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిల్లీలోని అనేక పరీవాహక ప్రాంతాల్లో నీరు ఎండిపోయి కనిపిస్తోంది.
దక్షిణ దిల్లీలోని కొన్ని ప్రాంతాలు సైతం యమనలో నీళ్ళు లేక తీవ్ర నీట సమస్యను ఎదుర్కొంటున్నాయి. తీవ్రత ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ముందుగానే తగినంత నీళ్ళు నిల్వ ఉంచుకోవాలని చెప్తోంది దిల్లీ జల్ బోర్డు. నీటి నిల్వలు తిరిగి సాధారణ స్థితికి చేరేవరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్తున్నారు అధికారులు.
హరియాణా నుంచి నీటి విడుదల తగ్గడం కూడా నీటి సమస్యకు కారణమని చెప్తున్నారు. కాలువల ద్వారా దిల్లీ ప్రాంతానికి రావాల్సిన నీరు రాకపోవడం వల్ల నీటి శుద్ధి కర్మాగారాలు సైతం ప్రభావితమైయ్యాయి. దేశంలోని పెద్ద ఉపనదిగా ఉన్న యమనా నదికే ఇంత స్థాయిలో నీటి సమస్య ఉందంటే, ఇకనైనా మనకు నీటి విలువ తెలియాల్సిన అసరం ఉంది.