iDreamPost
iDreamPost
కళ్యాణ్ రామ్ తో 118 రూపంలో మంచి సక్సెస్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ కం దర్శకులు కెవి గుహన్ కొత్త చిత్రం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఇటీవలే అద్భుతంతో తన డెబ్యూని ఓటిటిలో చేసుకున్న శివాని రాజశేఖర్ రెండో సినిమా ఇది. ఆదిత్ అరుణ్ హీరో కాగా ప్రియదర్శి, వైవా హర్ష లాంటి పేరున్న ఆర్టిస్టులు ఇందులో భాగం పంచుకున్నారు. గతంలో థియేట్రికల్ రిలీజ్ అనుకున్నారు కానీ ఇలాంటి కంటెంట్ బిగ్ స్క్రీన్ మీద వర్కౌట్ కాదనుకున్నారో లేక డిజిటల్ ఆఫర్ బాగా వచ్చిందో కారణం ఏదైనా మొత్తానికి చిన్నితెరపై వచ్చింది. సోనీ లివ్ లో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన ఈ వెబ్ ఎంటర్ టైనర్ మెప్పించిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం
హ్యాకింగ్ ద్వారా డబ్బులు సంపాదించే యువకుడు విశ్వ(ఆదిత్ అరుణ్). ఇలా సంపాదించిన సొమ్ముతో స్నేహితులతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకు మిత్ర(శివాని రాజశేఖర్)పరిచయమవుతుంది. అది కాస్తా విడిపోలేనంత ప్రేమగా మారుతుంది. అంతా బాగానే ఉంటుందనుకుంటున్న టైంలో వీళ్ళ జీవితంలోకి ఓ అపరిచితుడు ప్రవేశిస్తాడు. గతంలో విశ్వ చేసిన హ్యాకింగ్ వల్ల తీవ్రంగా నష్టపోయిన అతను ఇప్పుడు రివెంజ్ గేమ్ మొదలుపెడతాడు. అప్పటిదాకా బాగున్న విశ్వకు మొత్తం రివర్స్ అవుతుంది. కష్టాలు మొదలవుతాయి. అసలు విశ్వ చేసిన తప్పేంటి, ఎలా అందులో నుంచి బయట పడ్డాడు అనేదే కథ.
ఇలాంటి థీమ్ తో గతంలో హిందీ మలయాళం ఇంగ్లీష్ లో వెబ్ సిరీస్ లు సినిమాలు వచ్చాయి. కెవి గుహన్ తీసుకున్న పాయింట్ లో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ కథా కథనాలు మరీ తీసికట్టుగా ఉండటంతో ఈ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు విసుగు పుట్టిస్తుంది. అనవసరమైన సాగతీత కూడా చాలా ఉంది. నిడివి తక్కువగా ఉన్నా ల్యాగ్ అనిపించడం ముమ్మాటికీ దర్శకుడి లోపమే. ట్విస్టులు కూడా థ్రిల్ ఇచ్చేలా లేవు. ఉన్నంతలో సంగీత దర్శకుడు సైమన్ కె కింగ్, తమ్మిరాజు ఎడిటింగ్ లు డీసెంట్ గా సాగాయి కానీ ఫైనల్ గా జరిగిన ప్రయోజనం తక్కువే. బోలెడు ఓపిక అక్కర్లేని టైం ఉంటే తప్ప ఈ ట్రిపుల్ డబ్ల్యూ ఏ కోణంలోనూ సంతృప్తిపరచదు
Also Read : Minnal Murali : మిన్నల్ మురళి రిపోర్ట్