iDreamPost
iDreamPost
నిన్న ఆస్కార్ నామినేషన్లలో ఉంటుందని ఆశపడిన జైభీమ్ కు చివరికి మొండి చెయ్యి దక్కింది. ఇది రానంత మాత్రాన ఆ సినిమా విలువ తగ్గదు కానీ ఇంగ్లీష్ మీడియా ఉటంకించిన కథనాల ప్రకారం ఇది కచ్చితంగా లిస్టులో ఉండాల్సింది. మరి చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగాయో లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి నిరాశ కలిగిన మాట వాస్తవం. అయితే ఆనందం ఇంకో రూపంలో దక్కింది. రింటూ థామస్, సుశ్మిత్ ఘోష్ ల డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’కు నామినేషన్ దక్కడం ఊరట కలిగించే అంశం. ఇది సినిమా కాకపోయినా ఇండియా కంటెంట్ కి దక్కిన గుర్తింపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కథను ఖబర్ లెహ్రియా అనే పత్రిక నడిపే మహిళల జీవితాలను ఆధారంగా చేసుకుని రాసుకున్నది. బుండేలి, అవధి, బజ్జి అనే మూడు మాండలికల్లో దీన్ని ప్రచురించేవారు. బీహార్ లోని సీతామర్హి, ఉత్తర్ ప్రదేశ్ లోని బందా జిల్లాల నుంచి ఒక సామజిక వర్గానికి చెందిన స్త్రీలు దీన్ని నిర్వహిస్తున్నారు. గత ఏడాది సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఐదు అవార్డులు గెలుచుకుంది. ప్రింటింగ్ తో మొదలుపెట్టి డిజిటిల్ దాకా ఆ అతివలు చేసిన సాహసోపేత జర్నలిజంని ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇది సుమారు అయిదేళ్ల పాటు నిర్మాణం జరిగింది. వాళ్ళ ప్రయాణంలో ఎదురుకున్న ప్రమాదకరమైన మలుపులను కూడా చిత్రీకరించారు.
అమెరికా పాత్రికేయులతో కూడా రైటింగ్ విత్ ఫైర్ గొప్ప ప్రశంసలను దక్కించుకుంది. నిజమైన జర్నలిస్టులకు స్ఫూర్తినిచ్చేలా ఈ డాక్యుమెంటరీ ఉందని తెగ మెచ్చేసుకున్నారు. ఇది సంతోషించాల్సిన విషయమే అయినప్పటికీ ఎదురు చూసిన ప్రతిసారి మన సినిమాలకు మొండి చెయ్యి చెయ్యి చూపించడం సినిమా ప్రేమికులకు రుచించడం లేదు. జైభీమ్ నే ఉదాహరణగా చూపిస్తున్నారు. గతంలో కమల్ హాసన్, అమీర్ ఖాన్, గోవింద్ నిహలాని, రాజ్ కుమార్ హిరానీ లాంటి లెజెండరీలు ఎన్నో గొప్ప సినిమాలు అందించినా వాటికి పురస్కారం దక్కకపోవడం పట్ల ఇప్పటిఈ అసంతృప్తి అలాగే కొనసాగుతూనే ఉంది
Also Read : RRR : చరణ్ తారక్ అభిమానులకు పండగే