nagidream
nagidream
వినాయక చవితి అంటే లడ్డూ చాలా ఫేమస్. ఆ లడ్డూని వేలంపాటలో దక్కించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ డబ్బున్న కొందరికే ఆ అదృష్టం వరిస్తుందని అంటారు. ఇది ధనవంతుల పండుగ అని కూడా అంటారు. కానీ డబ్బు ఉంది కాబట్టి కొంటారు, కొనగలుగుతారు అని వారిని మన నుంచి వేరు చేయడానికి లేదు. డబ్బు ఉంటే సరిపోదు.. దాన్ని బయటకు తీయడానికి చాలా ధైర్యం కావాలి. దానికి భక్తి, నిస్వార్ధం, సేవాగుణం వంటివి తోడైతేనే అది సాధ్యమవుతుంది. ఇవన్నీ ఉన్న మహిళలే వీరు. పేదల కోసం లడ్డూని కోటి 26 లక్షలు పెట్టి కొన్నారు.
కోటి 26 లక్షలు పెట్టి వేలంపాటలో గణేష్ లడ్డూ కొనడంతో.. బండ్లగూడ జాగీర్ లోని రిచ్‌మండ్ విల్లాస్ లో ఉంటున్న ఈ మహిళలు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. డబ్బు ఉంది కాబట్టి కొన్నారు.. అందులో గొప్పేముంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీళ్ళు లడ్డూ కొనడం వల్ల ఆ డబ్బు సేవా కార్యక్రమాలకు వినియోగించబడుతుంది. దీని గురించి తెలియాలంటే మీకు ఈ మహిళల గురించి తెలియాలి. రిచ్‌మండ్ విల్లాస్ సొసైటీకి చెందిన మహిళలంతా కలిసి ‘ఆర్వీ దియా’ ఛారిటీని నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ పేరుతో ఎన్జీవోలకు ఆర్థిక సహకారం అందజేస్తుంటారు. ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ కి ఎన్జీవోలను రోజూవారీ ఆపరేషన్స్ ని సపోర్ట్ చేయడంలో ఘన చరిత్ర ఉంది.
ఫండ్స్ రైజ్ చేసి ఆర్థికంగా ఎన్జీవోలకు అండగా నిలుస్తుంది. ఈ ట్రస్టులో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు, సామాజిక కార్యకర్తలు, సీనియర్ సిటిజన్స్ వంటివారు వాలంటీర్లుగా ఉన్నారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు. గత కొన్నేళ్లుగా వీరంతా గణేష్ లడ్డూని వేలంపాటలో వేస్తున్నారు. బయట వ్యక్తులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు.
ఏటా గణేష్ లడ్డూ విక్రయించగా వచ్చిన డబ్బుని ఎన్జీవోలకి ఇస్తున్నారు. ఆ డబ్బుతో పేదలకు మెడికల్ సపోర్ట్, పేద విద్యార్థులకు చదువు, నెలవారీ కిరాణా సరుకులు అందుతున్నాయి. ఈ ఏడాది ఈ మహిళలు అందరూ కలిసి తలో కొంత డబ్బు వేసుకుని కోటి 26 లక్షలు రూపాయలు పోగుజేసి మరీ లడ్డూని దక్కించుకున్నారు. ఆ డబ్బుని పేదల కోసం ఇస్తామని అన్నారు. ఇలా లడ్డూని కొనడంలోనే కాదు.. గొప్ప మనసుని చాటుకోవడంలో కూడా రిచ్ కిడ్స్ అని అనిపించుకున్నారు. మరి కోటి 26 లక్షలతో గణేష్ లడ్డూ కొనుగోలు చేసి ఆ డబ్బుని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్న ఈ మహిళలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.