అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడమే కాకుండా కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు పై దురుసుగా ప్రవర్తించిన బీజేపీ నాయకులని స్వయానా మహిళా కలక్టరే చెంప చెళ్లుమనిపించిన ఘటన మద్య ప్రదేశ్ లొ జరిగింది.
వివరాల్లొకి వెళితే మద్య ప్రదేశ్ లొని రాయఘడ్ లో బీజేపీ నాయకులు సిఏఏ కి అనుకూలంగా తిరంగా ర్యాలీని నిర్వహించారు. అయితే ఈ ర్యాలీ కి ముందస్తు అనుమతి తీసుకోలేదు. అయితే అనుమతి లేకుండా ర్యాలీ ఎలా నిర్వహిస్తారని రాయఘడ్ కలెక్టర్ నివేదిత, డిప్యూటీ కలెక్టరు ప్రియా వర్మ లు ఈ తిరంగా యాత్రకి అడ్డు చెప్పారు. దీంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే తో పాటు బిజెపి కార్యకర్తలు కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు తో ఘర్షణ కి దిగారు.
దీనితో మహిళా అధికారులు దురుసుగా ప్రవర్తించిన బిజెపి నేతల చెంప పగలగొట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బిజెపి నాయకులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. కాగా బిజెపి నేతలను కలెక్టరు చెంప చెళ్లుమనిపించిన వీడియోని బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చెయ్యడం తో ఈ ఘటన ఇప్పుడు ఒక్క మధ్య ప్రదేశ్ లోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.