iDreamPost
android-app
ios-app

గుడి ముందు యువతి పిచ్చి పని.. ఛీ! నీకు వేరే ప్లేస్‌ దొరక లేదా..

  • Published Jul 03, 2023 | 7:15 PM Updated Updated Jul 03, 2023 | 7:15 PM
  • Published Jul 03, 2023 | 7:15 PMUpdated Jul 03, 2023 | 7:15 PM
గుడి ముందు యువతి పిచ్చి పని.. ఛీ! నీకు వేరే ప్లేస్‌ దొరక లేదా..

ఈ సృష్టిలో మనుషులు చేసే పిచ్చి పని ఏదైనా ఉంది అంటే.. అది కచ్చితంగా ప్రేమించటమే.. ప్రేమలో పడి ఎంతో మంది పిచ్చి వాళ్లుగా మారారు. ఇంకా ఎంతో మంది పిచ్చి వాళ్లుగా తయారవుతున్నారు. ఇందుకు ఉదాహరణలుగా నిత్యం సమాజంలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తాను ఎంతగానో ప్రేమించిన యువకుడికి ప్రపోజ్‌ చేయటానికి గుడిని ఎంచుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న శివ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కేధార్‌నాథ్‌ గుడి ముందు తన ప్రియుడికి ప్రపోజ్‌ చేసింది. దీన్నంతా వీడియో తీయటంతో.. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక, ఆ వీడియోనే ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. సోషల్‌ మీడియా వ్యాప్తంగా ఆమె తీరుపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి.. కొద్దిరోజుల క్రితం ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కేధార్‌నాథ్‌ గుడికి వెళ్లింది. ప్రధాన గుడి ముందు ఇద్దరూ పసుపు బట్టల్లో నిల్చుని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యువకుడు గుడి వైపు తిరిగి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో యువతి తన మిత్రుడి ద్వారా ఓ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ బాక్సును చేతుల్లోకి తీసుకుంది. అతడు ఎప్పుడెప్పుడు వెనక్కు తిరుగుతాడా? అని వేచి చూడసాగింది. అతడు దేవుడ్ని మొక్కటం అయిపోయిన తర్వాత తిరగగానే ‘విల్‌ యూ మ్యారీ మీ’ అంటూ ప్రపోజ్‌ చేసింది.

దీంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. తర్వాత ఆమె అతడికి రింగు తొడిగింది. తర్వాత ఇద్దరూ ఒకరినిఒకరు హత్తుకున్నారు. ఇక, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారి మిలియన్‌కుపైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది ఆమె చేసిన పనిని తప్పుబడుతుంటే.. మరికొందరు సపోర్టు చేస్తున్నారు. ‘‘ గుళ్ల దగ్గరకు ఫోన్లు తీసుకు పోవటాన్ని నిషేధించాలి. లేదంటే ఇలాంటి పిచ్చి పనులే చేస్తారు’’ అని కొందరు అంటుంటే.. ‘‘ పెళ్లిళ్లు గుళ్లల్లోనే కదా జరుగుతాయి. అలాంటప్పుడు ఇందులో తప్పేమి ఉంది’’ అంటూ మరికొందరు సపోర్టు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş