వీడియో: ట్రాఫిక్ పోలీస్ పై మహిళా ఆటో డ్రైవర్ వీరంగం!

ఇటీవల కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురైతూ క్షణికావేశంలో ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. సాధారణంగా ట్రాఫిక్ అంక్షలు అతిక్రమిస్తే.. పోలీసులు జరిమానా విధిస్తుంటారు. ఆ సమయంలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులకు మద్య చిన్న చిన్న గొడవలు జరగడం చూస్తూనే ఉంటాం. ఓ మహిళా ఈ-రిక్షా డ్రైవర్ గొడవ ట్రాఫిక్ పోలీసు అధికారిని తన చెప్పులతో పదే పదే కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఘజియాబాద్‌లోని ఇందిరాపురం ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఘజియాబాద్ లోని ఇందిరాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళా ఆటో డ్రైవర్ ఓ ట్రాఫిక్ పోలీస్ పై వీరంగం చేసింది. తన చెప్పు తీసుకొని అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో కొంతమంది వారించినా ఎవరినీ పట్టించుకోకుండా పదే పదే చెప్పుతో కొట్టింది. ఆ సమయంలో ఆమెను ట్రాఫిక్ పోలీస్ నియంత్రించడానికి విఫల యత్నం చేశారు. కానీ ఆమె మాత్రం చెప్పుతో కొడుతూ నానా దుర్భాషలాడుతు తెగ హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై సీనియర్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ పూనమ్ మిశ్రా మాట్లాడుతూ.. సదరు మహిళా ఆటో డ్రైవర్ ప్రవర్తన దారుణంగా ఉందని.. ఒక ప్రభుత్వ ఉద్యోగి అని చూడకుండా దాడి చేయడం నేరం అని అన్నారు. ఇటీవల ఆటో రిక్షాల కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని ఫిర్యాదులు రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆటో రిక్షాను అక్కడ నుంచి తరలించమని సదరు మహిళను ట్రాఫిక్ పోలీస్ కోరడంతో అతనితో ఆమె అనుచితంగా ప్రవర్తించిందని పునమ్ మిశ్రా తెలిపారు. గతలో ఆ మహిళపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయని ఆమె అన్నారు.

Show comments